(Source: ECI/ABP News/ABP Majha)
Infinix Zero 30 5G: రూ.25 వేలలోపే బెస్ట్ ఫోన్! - ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ ఫీచర్లు చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫీనిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ.
ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ జీరో 20 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ మొబైల్ లాంచ్ అయింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న హోల్ పంచ్ డిస్‌ప్లేను కంపెనీ ఇందులో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు.
గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డెలివరీలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 60 డిగ్రీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 950 నిట్స్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ముందువైపు పంచ్ హోల్ కటౌట్ అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ కూడా అందించారు. ఇన్‌ఫీనిక్స్ మెమ్‌ఫ్యూజర్ ర్యామ్ ఫీచర్ ద్వారా మెమొరీని కూడా ర్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇలా 21 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటితో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు.
5జీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.3, వైఫై 6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జీ-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. డీటీఎస్ హై రిజల్యూషన్ ఆడియో టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ ఎక్కనుందని కంపెనీ ప్రకటించింది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial