Infinix Zero 20: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?
ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. అదే ఇన్‌ఫీనిక్స్ జీరో 20.
ఇన్‌ఫీనిక్స్ జీరో 20 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. 4జీ హ్యాండ్‌సెట్‌గానే ఇది మార్కెట్లోకి రానుంది. ఇప్పుడు దీని ఫీచర్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి.
ఈ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లను ప్రముఖ టిప్‌స్టర్ అంకిత్ లీక్ చేశారు. దీని రెండర్లను బట్టి చూస్తే ఈ ఫోన్ మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకాల ఎడమవైపు పైభాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 20 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఉపయోగించని స్టోరేజ్ నుంచి 5 జీబీ స్టోరేజ్‌ను ర్యామ్‌గా మార్చుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
ఇన్‌ఫీనిక్స్ జీరో 20 స్మార్ట్ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వైఫై 5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉండనుంది. స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ రానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram