Smartphone Battery Saving Tips: బ్యాటరీ సెట్టింగ్స్ మారిస్తే బ్యాకప్ పెరుగుతుందా? - కొత్త దానిలా పని చేస్తుందా?
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సేవ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
Smartphone Battery: స్మార్ట్‌ఫోన్ వాడే కొద్దీ పాతదిగా మారుతుంది. అలాగే దాని బ్యాటరీ శక్తి కూడా తగ్గుతుంది. అయితే కొంత మంది టెక్ నిపుణులు బ్యాటరీ సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా బ్యాటరీ పనితీరును తగ్గకుండా ఉపయోగించవచ్చని అంటున్నారు. మరి అది సరైనదేనా?
మీరు చాలా రోజులు స్మార్ట్‌ఫోన్‌ను ఆన్ చేయకుండా ఉంచినప్పుడు, దాని బ్యాటరీలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లడం ద్వారా మీరు దీన్ని పరిష్కరించవచ్చు. దీంతో బ్యాటరీ హీటింగ్, ఛార్జింగ్ కాకపోవడం వంటి సమస్యలను మాత్రమే పరిష్కరించవచ్చు. అయితే బ్యాటరీ మునుపటిలా పనిచేస్తుందని ఎవరైనా చెబితే వారు పూర్తిగా అబద్ధం చెబుతున్నట్లే.
ఏ వస్తువైనా సరే, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పనితీరు క్రమంగా తగ్గుతూనే ఉంటుంది తప్ప కొత్తదిగా ఉన్నటప్పుడు ఎలా ఉందో అలానే ఉండటం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దాని పనితీరును మెరుగు పరచవచ్చు.
పనికిరాని యాప్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయండి
చాలా సార్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో మీకు ఉపయోగం లేని కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు వాటిని వెంటనే తొలగించాలి. యాప్‌ల కారణంగా బ్యాటరీపై నిరంతరంగా చెడు ప్రభావం ఉంటుంది. మీకు ఆ విషయం తెలియడం కూడా కష్టం అవుతుంది. తెలుసుకునే లోపు బ్యాటరీ పాడైపోతుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తూనే ఉండాలి
సాధారణంగా ప్రజలు తమ పాత స్మార్ట్ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయరు. దీని కారణంగా బ్యాటరీ బలహీనంగా మారుతుంది. ఎందుకంటే కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే ఫీచర్లను కూడా జోడిస్తాయి. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తే, అది బ్యాటరీ లైఫ్‌ను కాపాడుతుంది.
మరోవైపు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రీ ఆర్డర్‌లు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ మనదేశంలో సెప్టెంబర్ 12వ తేదీన లాంచ్ అయింది. అలాగే దాని డెలివరీలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే, క్యాష్‌బ్యాక్ ఆఫర్, దానిపై లభించే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకోవడం మంచిది. ఐఫోన్ 15 సిరీస్‌లో ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి యాపిల్ బీకేసీ ముంబై, యాపిల్ సాకేత్ ఢిల్లీ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial