Huawei Mate 50e: కేక పుట్టించే కెమెరాలతో హువావే కొత్త ఫోన్ - ఎంత కెపాసిటీనో తెలుసా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే హువావే మేట్ 50ఈ.
![Huawei Mate 50e: కేక పుట్టించే కెమెరాలతో హువావే కొత్త ఫోన్ - ఎంత కెపాసిటీనో తెలుసా? Huawei Mate 50e Launched With 50MP Dual Rear Camera Setup Price Features Huawei Mate 50e: కేక పుట్టించే కెమెరాలతో హువావే కొత్త ఫోన్ - ఎంత కెపాసిటీనో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/60408004693830078e90abfb216d4b171663528514803252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హువావే మేట్ 50ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో మంగళవారం లాంచ్ అయింది. హువావే మేట్ 50 సిరీస్‌లో అత్యంత చవకైన మోడల్ ఇదే. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది ఒక 4జీ ఫోన్. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
హువావే మేట్ 50ఈ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,999 యువాన్లుగా (సుమారు రూ.46,000) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగా (సుమారు రూ.52,000) ఉంది. ఫ్రాస్ట్ సిల్వర్, ఆబ్సీడియన్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీని సేల్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.
హువావే మేట్ 50ఈ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గా ఉంది. హార్మొనీఓఎస్ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4460 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4460 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 256 జీబీ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)