అన్వేషించండి

Huawei Mate 50 Pro: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన హువావే - కెమెరాలు అదుర్స్, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ కూడా!

హువావే తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అయిన మేట్ 50 ప్రోను లాంచ్ చేసింది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.

హువావే మేట్ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కావడం విశేషం.

హువావే మేట్ 50 ప్రో ధర
దీని ధరను 1,299 యూరోలుగా (సుమారు రూ.1,02,000) నిర్ణయించారు. బ్లాక్, సిల్వర్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హువావే మేట్ 50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2616 x 1212 పిక్సెల్స్‌గా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్ అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 66W సూపర్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డ్యూరబులిటీ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. గూగుల్ యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఇది కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget