Honor X9c: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే హానర్ ఎక్స్9సీ. ఈ ఫోన్ ప్రస్తుతానికి మలేషియాలో అందుబాటులో ఉంది. త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
Honor X9c Launched: హానర్ ఎక్స్9సీ స్మార్ట్ ఫోన్ మలేషియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6600 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఐపీ65ఎం రేటింగ్, 2 మీటర్ డ్రాప్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. 360 డిగ్రీ వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు. ఓఐఎస్ ఫీచర్లున్న 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాను అందించారు. హానర్ ఎక్స్9బీ మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ అయింది. కాబట్టి హానర్ ఎక్స్9సీ కూడా మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
హానర్ ఎక్స్9సీ ధర (Honor X9c Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.28,700) నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.32,500) ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. జేడ్ సియాన్, టైటానియం బ్లాక్, టైటానియం పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
హానర్ ఎక్స్9సీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Honor X9c Specifications)
ఇందులో 6.78 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ65ఎం రేటింగ్, 360 డిగ్రీ వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6600 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, ఓటీజీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందుబాటులో ఉన్నాయి. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది. హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయి మంచి సేల్స్‌ను నమోదు చేసింది. కాబట్టి హానర్ ఎక్స్9సీ కచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?