అన్వేషించండి

Honor X40i: 17 జీబీ ర్యామ్‌తో 5జీ ఫోన్ - ధర రూ.24 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది.

హానర్ ఎక్స్40ఐ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ కెమెరా, 40w ఫాస్ట్ చార్జింగ్‌ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా హానర్ ఎక్స్40ఐలో ఉంది.

హానర్ ఎక్స్40ఐ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.19,000) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (సుమారు రూ.21,350), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ (సుమారు రూ.23,700) నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్, రోజ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

హానర్ ఎక్స్40ఐ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. పంచ్ హోల్ డిస్‌ప్లే, స్క్రీన్ టు బాడీ రేషియో 93.6 శాతంగా ఉంది . 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఇందులో 5 జీబీ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 17 జీబీ ర్యామ్ ఈ ఫోన్‌తో పొందవచ్చన్న మాట.

దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 40W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్40ఐ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, బైదు, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉండగా, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Team India Selection Controversy:  ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Bigg Boss Season 10 Today Sep 19th Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
Agarkar Exit Drama: రోహిత్ తో విభేదాలు, లక్ష్మణ్‌తో పగ.. అగార్కర్‌ను సాగనంప‌డానికి కార‌ణాలు ఇవేనా..?
రోహిత్ తో విభేదాలు, లక్ష్మణ్‌తో పగ.. అగార్కర్‌ను సాగనంప‌డానికి కార‌ణాలు ఇవేనా..?
Embed widget