Google Pixel 9 Pro Fold Discount: రూ. 50 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్‌కు Google Pixel 9 Pro Fold కొనేయండి.. అదిరిపోయే డీల్
Google Pixel 9 Pro Fold Price | మీరు అధిక ధర కారణంగా గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ కొనలేకపోతే, అయితే మీకు కంపెనీ శుభవార్త చెప్పింది. గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.

Google Pixel 9 Pro Fold Discount: మీరు గూగుల్ కంపెనీకి చెందిన మడతపెట్టే ఫోన్.. అదేనండీ ఫోల్డబుల్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ధర ఎక్కువగా ఉందని ఆగిపోతున్నారు. బడ్జెట్ కారణంగా కొనడంపై వెనక్కి తగ్గుతున్నారా.. అయితే ఇది మీకు గుడ్ న్యూస్. Google Pixel 9 Pro Fold ప్రస్తుతం భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో అద్భుతమైన ఆఫర్ల కారణంగా ఈ ఫోన్ ధర రూ. 50,000 కంటే ఎక్కువ తగ్గింది. మీరు మునుపటి కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, దానిపై లభిస్తున్న డీల్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Google Pixel 9 Pro Fold ఫీచర్లు
Googleకు చెందిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ పలు బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్‌కు సపోర్ట్ చేసే 6.3 అంగుళాల OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీ కలిగి ఉంది. అన్‌ఫోల్డ్ చేసినప్పుడు, ఇది 8 అంగుళాల OLED స్క్రీన్‌ను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. Google Tensor G4 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ 4,650mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
పవర్‌ఫుల్ కెమెరా సెటప్
గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు వాటి కెమెరా ఫీచర్లతో ఫేమస్ అయ్యాయి. ఈ ఫోన్ కూడా కెమెరా విషయంలో బెస్ట్ అనిపించుకుంటుంది. Google Pixel 9 Pro Fold వెనుక భాగంలో 48MP మెయిన్ లెన్స్‌తో పాటు 10.5MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 2 డిస్‌ప్లేల ముందు భాగంలో 10MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి.
Flipkartలో ఈ డీల్ లభిస్తుంది
Pixel 9 Pro Fold రూ. 1,72,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ Flipkartలో రూ. 1,19,999కి అందుబాటులోకి వచ్చింది. అంటే ఏకంగా రూ. 50,000 కంటే ఎక్కువ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. మీ వద్ద Flipkart Axis లేదా SBI క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు దీనిపై అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. దాంతో ఫోన్ ధర రూ. 1,15,999కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను ఇచ్చి మీరు రూ. 61,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.






















