News
News
X

Google Pixel 7 Pro: కెమెరాల్లో దీనికి యాపిల్ మాత్రమే పోటీ - గూగుల్ పిక్సెల్ 7 ప్రో వచ్చేసింది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ అయింది. అదే గూగుల్ పిక్సెల్ 7.

FOLLOW US: 
 
గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ తన ఈవెంట్లో లాంచ్ చేసింది. గూగుల్ రెండో తరం టెన్సార్ జీ2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.84,999గా నిర్ణయించారు. స్నో, ఆబ్సీడియన్, హేజెల్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 13వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయ్యాయి. ప్రీ-ఆర్డర్ ద్వారా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 7 ప్రో పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు గూగుల్ పిక్సెల్ 7 తరహాలోనే 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

News Reels

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Made by Google (@madebygoogle)

Published at : 06 Oct 2022 11:06 PM (IST) Tags: Google New Phone Google Pixel 7 Pro Google Pixel 7 Pro Features Google Pixel 7 Pro Price in India Google Pixel 7 Pro Launched Google Pixel 7 Pro Specifications

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !