Google Pixel 6A: గూగుల్ పిక్సెల్ 6ఏపై అమెజాన్‌లో సూపర్ ఆఫర్ - అంత తక్కువకి వస్తుందా?
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులైలోనే లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు దాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించలేదు. గూగుల్ పిక్సెల్ 6ఏ ధర మనదేశంలో రూ.43,999గా ఉంది. అంతకు ముందు వచ్చిన గూగుల్ పిక్సెల్ 4ఏ ధర రూ.31,999గా నిర్ణయించారు.
ధర తక్కువగా ఉంటే నథింగ్ ఫోన్ 1, రియల్‌మీ జీటీ నియో 3టీ వంటి ఫోన్లతో గూగుల్ పిక్సెల్ 6ఏ పోటీ పడేది. ఈ అవకాశాన్ని గూగుల్ జారవిడుచుకుంది. అయితే ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 6ఏ మరింత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.34,999కే అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే ఇది రూ.9,000 తక్కువ. గూగుల్ పిక్సెల్ 6ఏ 5జీపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ ఇదే. దీనికి ఎటువంటి క్రెడిట్ కార్డు కూడా అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ మెథడ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ తన పిక్సెల్ ఫోన్స్‌ను అధికారికంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తుంది. అంటే పిక్సెల్ 6ఏను అమెజాన్ నేరుగా విక్రయించడం లేదన్న మాట. థర్డ్ పార్టీ సెల్లర్స్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు ఉన్నారు. అయితే పిక్సెల్ 6ఏను విక్రయిస్తున్న ‘world bazzar’ అనే సెల్లర్‌కు మంచి రేటింగ్స్ ఉన్నాయి.
ఈ ఫోన్‌పై డెలివరీ చార్జ్ లేదు కానీ ఫ్లిప్‌కార్ట్ కంటే డెలివరీకి ఎక్కువ సమయం పట్టనుంది. అంటే మీకు మనదేశం నుంచి కాకుండా వేరే కంట్రీ యూనిట్ వచ్చే అవకావం ఉంది. పిక్సెల్ ఫోన్స్‌కు ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది కాబట్టి మనదేశంలో కూడా దీన్ని సర్వీస్ చేయించవచ్చు.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?