Foldable Smartphone Offers: రూ.30 వేలలోపే ఫోల్డబుల్ ఫోన్ - మడత ఫోన్లపై మంచి డీల్స్!
Best Foldable Smartphones: ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల ధరలు తగ్గుతున్నాయి. దీంతో యూజర్లు వీటిని కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫర్ సేల్స్‌లో బెస్ట్ ఆఫర్స్ పొందిన ఫోల్డబుల్ ఫోన్లు.
Best Foldable Smartphones Offers: మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు ఉత్తమ సమయం. వాస్తవానికి, ఈ సమయంలో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌లు రూ. 35,000 కంటే తక్కువ ధరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మీరు మోటొరోలా, టెక్నో, ఒప్పో వంటి బ్రాండ్ల నుంచి ప్రతి రేంజ్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లను పొందుతారు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024 జరుగుతున్నాయి. ఇందులో మీరు ఉత్తమమైన డీల్స్‌ను పొందుతారు.
మోటొరోలా రేజర్ 40 (Motorola Razr 40)
మోటొరోలా లాంచ్ చేసిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 33,749కి అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి. రేజర్ 40లో 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించే 6.9 అంగుళాల స్క్రీన్‌ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ (Samsung Galaxy Z Flip 3 5G)
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపును పొందుతోంది. మీరు ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ను 58 శాతం తగ్గింపుతో కేవలం రూ.39,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ (TECNO Phantom V Flip 5G)
టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ ప్రస్తుతం రూ. 30,000 కంటే తక్కువ ధరతో మార్కెట్లోనే అత్యంత చవకైన ఫోల్డబుల్ ఫోన్‌గా ఉంది. దీని డిజైన్, లుక్ చాలా ప్రీమియంగా ఉంటాయి. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.29,899కి అందుబాటులో ఉంది.
మోటొరోలా రేజర్ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra)
మీరు రూ. 50,000 లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. దీనిలో మీరు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను పొందుతారు. రేజర్ 40 అల్ట్రా ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ల జాబితాలో చేరింది. దీని ధర ప్రస్తుతం రూ.46,749గా ఉంది.
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip)
ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.59,999గా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే