వివో వీ40, వివో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వివో వీ సిరీస్ ఫోన్లు మనదేశంలో పెద్ద సక్సెస్ అయ్యాయి. వివో వీ40 ధర మనదేశంలో రూ.34,999 నుంచి ప్రారంభం కానుంది. వివో వీ40 ప్రో ధర మనదేశంలో రూ.49,999 నుంచి స్టార్ట్ అవుతుంది. వివో వీ40లో వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, వివో వీ40 ప్రోలో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. వివో వీ40లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అందించారు. వివో వీ40 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. రెండు ఫోన్లలోనూ 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వివో వీ40 సేల్ ఆగస్టు 19 నుంచి, వివో వీ40 ప్రో సేల్ ఆగస్టు 13 నుంచి మొదలు కానుంది.