News
News
X

Asus 9Z: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ ఇటీవలే తన జెన్‌ఫోన్ 9ను లాంచ్ చేసింది. ఇది మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.

FOLLOW US: 
 
అసుస్ జెన్‌ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ ఇటీవలే గ్లోబల్ లాంచ్ అయింది. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. యాపిల్ తరహాలో చిన్న డిజైన్‌తో రానున్న ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వారిని ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేయనుంది. దీనికి మనదేశంలో అసుస్ 9జెడ్ అని పేరు పెట్టనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ 9 ధర (అంచనా)
అసుస్ జెన్ ఫోన్ 9 ధర యూరోప్‌లో 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా దీని ధర రూ.70 వేల రేంజ్‌లో ఉండవచ్చు.

అసుస్ జెన్‌ఫోన్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఈ ఫోన్ యూరోప్ వేరియంట్ తరహాలోనే మనదేశంలో కూడా దీని ఫీచర్లు ఉండనున్నాయి. దీని యూరోప్ వేరియంట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు.

16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్‌కు ఇంటిగ్రేట్ చేశారు.

News Reels

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందించనుంది. డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Published at : 24 Oct 2022 05:27 PM (IST) Tags: Asus Asus Zenfone 9 Asus 9Z India Launch Asus 9Z Asus 9Z Specifications Asus 9Z Expected Price

సంబంధిత కథనాలు

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Vivo Y02: రూ.తొమ్మిది వేలలోపే వివో కొత్త ఫోన్ - 1 టీబీ స్టోరేజ్ వరకు - రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లతో పోటీ!

Vivo Y02: రూ.తొమ్మిది వేలలోపే వివో కొత్త ఫోన్ - 1 టీబీ స్టోరేజ్ వరకు - రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లతో పోటీ!

సెల్ఫీలలో ఎన్ని రకాలున్నాయో తెలుసా ? మీరు దిగే సెల్ఫీ పేరు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

సెల్ఫీలలో ఎన్ని రకాలున్నాయో తెలుసా ? మీరు దిగే సెల్ఫీ పేరు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

టాప్ స్టోరీస్

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్