iPhone: డిమాండ్ లేదు - తక్కువ తయారు చేయండి - ఆ ఐఫోన్‌పై తయారీదారులకు సూచించిన యాపిల్!
యాపిల్ ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌కు తక్కువ డిమాండ్ ఉన్నందున దీని ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్ నిర్ణయించింది.

ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌కు తక్కువ డిమాండ్ ఉన్నందున ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్ నిర్ణయించింది. ఐఫోన్ 14 ఉత్పత్తిని వెంటనే నిలిపివేయమని కనీసం ఒక యాపిల్ సరఫరాదారుని కోరింది. ఐఫోన్ 14 ఉత్పత్తిని 90 శాతం వరకు తగ్గించడానికి ఇద్దరు కాంపోనెంట్ సరఫరాదారులను కూడా సంప్రదించినట్లు మీడియా నివేదించింది.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌ల ఉత్పత్తిని పెంచమని యాపిల్ తన సరఫరాదారులలో ఒకరిని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ డిమాండ్ ఎలా ఉందో కంపెనీ అంచనా వేస్తోందని కథనాలు వస్తున్నాయి.
అయితే దీనిపై యాపిల్ ఇంకా స్పందించలేదు. ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌కు చాలా తక్కువ డిమాండ్ ఉందని, ఇది నాన్-ప్రో మోడల్ అయినా ధర 899 డాలర్లుగా ఉంది. భారతదేశంలో iPhone 14 Plus ధర రూ.89,900 నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 14 ప్లస్ ధర
ఇందులో 128 జీబీ వేరియంట్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. 256 జీబీ వేరియంట్ ధర రూ.99,900 కాగా, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది. బ్లూ, పర్పుల్, స్టార్ లైట్, మిడ్‌నైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

