Airtel Vs Jio: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
Airtel Reliance Jio Best Plans: ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రూ.100 లోపు కొన్ని మంచి డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Recharge Plans: ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ పెరుగుదల తర్వాత చాలా మంది ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లడం ప్రారంభించారు. అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందించే రూ. 100 కంటే తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో ఎయిర్‌టెల్, జియోల్లో వినియోగదారులకు ఎవరు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నారో కూడా తెలుసుకుందాం.
జియో అందిస్తున్న ప్లాన్లు
జియో తన కస్టమర్ల కోసం నాలుగు డేటా యాడ్ ఆన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, వీటిని డేటా బూస్టర్‌లు అని కూడా పిలుస్తారు. ఈ ప్లాన్‌లు మీ ప్రస్తుత యాక్టివ్ రీఛార్జ్‌కి యాడ్ అవుతాయి. మీ రోజువారీ డేటా లిమిట్ ముగిసినప్పుడు ఈ ప్లాన్‌లు డేటా సౌకర్యాన్ని అందిస్తాయి.
ప్లాన్ ధరలు: రూ. 19, రూ. 29, రూ. 69, రూ. 139.
డేటా పరిమితి: 1 జీబీ నుంచి 12 జీబీ అదనపు డేటా లభిస్తుంది.
వ్యాలిడిటీ: ఇది మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ ప్లాన్‌లతో ఇంటర్నెట్ లిమిట్ ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ. 99 యాడ్ ఆన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది మీ ప్రస్తుత రీఛార్జ్‌తో పాటు పని చేస్తుంది.
డేటా: 20 జీబీ అపరిమిత డేటా లభిస్తుంది.
వ్యాలిడిటీ: రెండు రోజులు.
అదనపు ప్రయోజనాలు: ఈ ప్లాన్‌తో రెండు రోజుల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
ఈ ప్లాన్ ప్రత్యేకించి తక్కువ కాలంలో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పూర్తిగా ఉపయోగించాలనుకునే వారి కోసం ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో సినిమాలు, సిరీస్, గేమింగ్‌లను ఆస్వాదించవచ్చు. మీకు హై స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ బడ్జెట్‌లో గొప్ప ప్రయోజనాలు కావాలంటే ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
Upgrade your digital life with the new Redmi A4 5G and Jio True 5G 🚀
— Reliance Jio (@reliancejio) November 28, 2024
Recharge with any Jio 5G plan and enjoy Free Premium access to 10 OTT Apps for 3 months and Unlimited 5G Data.
<https://t.co/3PBjhKBdQL>#RedmiA4 #JioTrue5G #Jio #Indiakarega5G #5G #DigitalLife #OTT… pic.twitter.com/BGyZbDruG1
At the ITU World Telecommunication Standardization Assembly, Sunil Bharti Mittal, Chairman of Bharti Enterprises and founder of Bharti #Airtel, stated, "Airtel has been at the forefront of India's telecom revolution. We are committed to ensuring user safety with our anti-spam… pic.twitter.com/idRTUQgDcf
— DD News (@DDNewslive) October 15, 2024