Smartphone Buying Guide: దసరా, దీపావళికి స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? - కచ్చితంగా ఇవి ఉండేలా చూసుకోండి!
Mobile Buying Guide: ప్రస్తుత పండగ ఆఫర్లలో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునేవారు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Smartphone Buying Tips: పండగలు అంటే ప్రతిఒక్కరికీ ఎంతో ఆనందం. ఈ సమయంలో ఏదో ఒకటి కొనుగోలు చేయాలని చాలా మంది ఆసక్తిగా ఉంటారు. ఎలాగైనా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే స్థానిక షోరూంల దగ్గర్నుంచి ఇ-కామర్స్ సంస్థల వరకు బోలెడెన్నీ రాయితీలు, ఆఫర్లను ప్రకటిస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి ఆయా కంపెనీలు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ప్రజలు. అయితే ఇప్పుడు దసరా, దీపావళి పండగల వేళ ప్రత్యేక సేల్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
అయితే పండగ సేల్స్ ఏదైనా ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అందుకే మొబైల్స్ సేల్స్ భారీగా పెరగటం వల్ల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను లాంఛ్ చేస్తూ తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఫెస్టివల్ సీజన్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలు కూడా ఈ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పండగ ఆఫర్లలో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునేవారు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర - ముందుగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే మీ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత బ్రాండ్‌ను ఎంచుకోవాలి. యాపిల్, గూగుల్, శాంసంగ్, రెడ్ మీ, రియల్ మి, మోటోరోలా ఇంకా చాలానే బ్రాండ్లు ఉన్నాయి. అలానే ఏ బ్రాండ్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో కూడా చూసుకోవాలి.
ఆపరేటింగ్ సిస్టమ్ - అనంతరం ఏ స్మార్ట్ ఫోన్ కచ్చితంగా మొదటగా చూడాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇందులో ఆండ్రాయిడ్ కొనాలా లేదా iOS అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలి. ఈ రెండింటికీ డిఫరెంట్ ఫీచర్స్ అండ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మరింత కస్టమైజేషన్‌ను కలిగి ఉంటుంది. హార్డ్‌వేర్‌లో మరింత వైవిధ్యం ఉంటుంది. ఇక ఆపిల్ iOS ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీపై బాగా ఫోకస్ చేస్తుంది. అందుకే ఈ ఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రాసెసర్ - ఫోన్ స్పీడ్‌గా, అన్ని యాప్స్‌ను సపోర్ట్ చేసేలా, హ్యాంగ్ అవ్వకుండా పనిచేయాలంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్‌పైనే ఆధారపడి ఉంటుంది. Qualcomm Snapdragon 7 సిరీస్ లేదంటే యాపిల్ A15 బయోనిక్ వంటి మిడ్-రేండ్ ప్రాసెసర్లు బెస్ట్ అని చెప్పొచ్చు. గేమర్స్ లేదా హెవీ మల్టీ టాస్కర్ల కోసం అయితే హై-ఎండ్ చిప్‌సెట్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్ ఉత్తమం.
కెమెరా క్వాలిటీ - చాలా మందికి స్మార్ట్ ఫోన్ అనగానే ముందుగా చూసేది కెమెరానే. ఎందుకంటే ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ఫొటోస్, వీడియోస్, రీల్స్‌కు ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. అందుకే స్మార్ట్‌ఫోన్‌కు మంచి కెమెరా క్వాలిటీ ఉండాలి. ఈ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), సాఫ్ట్‌వేర్ ఎన్హాన్స్మెంట్స్, లో-లైట్ వంటి ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి.
స్టోరేజ్ అండ్ ర్యామ్ - మరి తీసిన ఫొటోలు, వీడియోల పాటు ఇతర గేమ్ యాప్స్ లేదా ఇంకేదైనా యాప్స్ స్టోరేజే చేసకోవడానికి ఇంటర్నెల్ స్టోరేజ్ ఉన్న ఫొన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. కాబట్టి ఎంత స్టోరేజీ అవసరం అనేది ఓ అంచనాకు వచ్చి ఉండాలి. అది మన యూసేజ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే బెస్ట్. అలాగే RAM కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 8GB లేదా అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు అయితే మల్టీ టాస్కింగ్‌కు మంచిగా ఉపయోగపడతాయి.
5G నెట్‌వర్క్ - ప్రస్తుత యుగంలో 5G నెట్‌వర్క్ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే నెట్ బాగా స్లోగా వస్తుంది. అదే స్పీడ్‌గా ఉంటే మనకు కావాల్సిన సమాచారం లేదా ఇంకేదైనా చాలా త్వరగా మన అరచేతిలోకి వచ్చి కనిపిస్తాయి. అయితే 5G మొబైల్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ - స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పైన ఉన్న ఫీచర్స్‌తో పాటు మన్నిక, డిజైన్ కూడా అవసరమే. మంచి అట్రాక్షన్ డిజైన్‌తో పాటు ఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి. ఎందుకంటే ఫోన్లు కింద పడిపోయినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఇవి కాపాడుతాయి. దీని కోసం గొరిల్లా గ్లాస్, వాటర్ రెసిస్టెంట్ (IP రేటింగ్) ఉన్న ఫోన్‌లు కొనడం బెస్ట్ ఛాయిస్.
బ్యాటరీ లైఫ్ - స్మార్ట్ ఫోన్లో ఎన్ని సూపర్ ఫీచర్స్ ఉన్న దాన్ని వాడాలంటే ఫోన్లో ఛార్జ్ ఉండాలి. కాబట్టి మంచి బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఫోన్‌ను తీసుకోవాలి. కాబట్టి కనీసం 4000mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. అలానే తక్కువ సమయంలోనే ఫాస్ట్ ఛార్జ్ అయ్యేలా తీసుకోవాలి.