Micromax New Phone: మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ వచ్చేది అప్పుడే.. రూ.15 వేలలోనే సూపర్ ఫీచర్లు!
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మనదేశంలో ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జనవరి 25వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని పేరు, డిజైన్, కలర్ ఆప్షన్లు లాంచ్ తేదీని ట్విట్టర్‌లో కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ధర
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. అయితే సేల్‌కు ఎప్పుడు రానుందో మాత్రం కంపెనీ అధికారికంగా తెలపలేదు. ఈ ఫోన్ ధర రూ.15,000 రేంజ్‌లో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక సేల్ తేదీని కూడా కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ గురించిన సమాచారాన్ని మైక్రోమ్యాక్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందా? అని ఒక వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు మైక్రోమ్యాక్స్ ‘ఉండవచ్చు’ అని సమాచారం ఇచ్చింది.
ఈ ట్విట్టర్ పోస్టు ప్రకారం ఈ ఫోన్‌లో డాజ్లింగ్ గ్లాస్ ఫినిష్ ఉండనుంది. అయితే ఈ ఫోన్‌లో గ్లాస్ ప్యానెల్ ఉంటుందా? ప్లాస్టిక్ ప్యానెల్ ఉంటుందా? గ్లాస్ తరహా ఫినిషింగ్ ఉంటుందా? వంటి విషయాలు తెలియరాలేదు. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో బ్లూ, బ్రౌన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.
ఈ ఫోన్ గురించి మరింత సమాచారం అందుబాటులో లేదు. లాంచ్ దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. గతంలో లాంచ్ అయిన దీని ముందు వెర్షన్ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
Revealing the best way to #LevelUp Your Style.
— IN by Micromax - IN Note 2 (@Micromax__India) January 21, 2022
Presenting #MicromaxINNote2 with Dazzling Glass finish, launching on 25.01.2022.#INMobiles #INForINdia #INdiaKeLiye pic.twitter.com/qG17T2Hky0
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి