WFH Job Scam: వాట్సాప్, టెలిగ్రాంలో ‘వర్క్ ఫ్రం హోం’ జాబ్స్ దందా - యస్ అంటే మీ డబ్బులు గోవిందా!
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రాంల్లో వర్క్ ఫ్రం హోమ్‌కు సంబంధించిన మోసాలు జరుగుతున్నాయి.
WFH Job Scam: ఆన్‌లైన్ మోసాల కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ప్రజల నిస్సహాయతను ఉపయోగించుకుని మోసగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కేరళకు చెందిన ఒక మహిళకు వర్క్ ఫ్రం హోం జాబ్స్ అంటూ ఎర వేసి రూ. 7 లక్షలకు పైగా కాజేశారు. మందిరా శర్మ అనే అకౌంట్ నుంచి బాధిత మహిళకు టెలిగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ప్రతిరోజూ కొన్ని ఆన్‌లైన్ సేవలకు రేటింగ్ ఇవ్వవలసి ఉంటుందని, ప్రతిఫలంగా ఆమె డబ్బు పొందుతుందని తెలిపారు. సులభంగా ఉన్నందున బాధిత మహిళ ఈ పని చేయడానికి అంగీకరించింది.
ప్రారంభంలో నగదు బదిలీ
ప్రారంభంలో చేసిన పనికి బదులుగా స్త్రీకి డబ్బు ఇచ్చారు. బాధిత మహిళకు నమ్మకం కలిగిందని భావించిన వెంటనే మోసగాళ్లు తమ అసలు పథకం అమలు చేశారు. కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టమని ఆ మహిళను కోరారు. బాధితురాలు మంచి ఆదాయాన్ని కోరుకున్నందున ఆమె విడివిడిగా లావాదేవీలు చేసి మొత్తం రూ.7.91 లక్షలను మహిళ ఖాతాకు బదిలీ చేసింది. పెట్టుబడిపై మహిళకు రూ. 17,000 లాభం కూడా వచ్చింది. కొంత సమయం తరువాత డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, వెబ్‌సైట్ మూసివేశారని తెలిసింది. తాను మోసానికి గురైనట్లు మహిళ భావించింది. దీంతో వెంటనే ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు వివరాలను తెలిపి ఫిర్యాదు చేసింది.
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లింక్డ్‌ఇన్, నౌకరీ.కామ్, ఇన్‌డీడ్ వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌లలో దరఖాస్తు చేసుకోవడం మంచిది. మీరు మరేదైనా ప్లాట్‌ఫారమ్‌లో కూడా దరఖాస్తు చేస్తున్నట్లయితే ముందుగా అవతలి వ్యక్తి, కంపెనీ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి. ఆపై ముందడుగు వేయండి. మీకు కావాలంటే గూగుల్ సహాయం కూడా తీసుకోవచ్చు. కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు కేవలం భారతదేశంలోనే 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్ ఇలా రకరకాల మాధ్యమాల్లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.
వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. కాగా విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ యాప్‌లో ఇటీవలే కొత్త ఆప్షన్‌ను ఇచ్చింది. దీని సహాయంతో వాట్సాప్ అధికారులను సంప్రదించడం మరింత సులభం అవుతుంది.
వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను అబ్జర్వ్ చేసే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం కంపెనీ Windows వినియోగదారులకు యాప్‌లో ఛాట్ సపోర్ట్‌ను అందించడం ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు మొబైల్‌లో హెల్ప్ సపోర్ట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు విండోస్ యూజర్‌లు కూడా యాప్‌లో కూడా అదే విధంగా పొందుతారు.
వినియోగదారులు ఛాట్ లేదా మెయిల్‌లో వారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. విండోస్ వినియోగదారులకు కూడా ఈ అప్‌డేట్‌ను పొందడం ప్రారంభించారు. ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటంటే వినియోగదారులు వారి సమస్యలకు యాప్‌లోనే పరిష్కారం పొందుతారు. వారు యాప్‌ను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదు.
Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial