అన్వేషించండి

World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?

ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది.

World first laptop:  రోజురోజుకూ టెక్నాలజీ కొత్త రంగులు పులుముకుంటుంది. మార్కెట్‌లో ఆధునిక ఉత్పత్తులు వస్తుండటంతో పాత ఉత్పత్తులకు టాటా చెప్పేస్తున్నారు. నేడు ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ మన కోసం ఎన్నో పనులు చేస్తోంది. అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా వ్రాయడానికి టైప్‌రైటర్‌లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో సన్నని కీబోర్డ్‌లు వచ్చాయి. ఓవరాల్ గా టెక్నాలజీ ఆధునికంగా మారడంతో గాడ్జెట్ లు కూడా స్మార్ట్ గా మారాయి.

మీరు ఈరోజు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లను ఎప్పుడు కనిపెట్టారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి వ్యక్తిగత డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎవరు, ఎప్పుడు తయారు చేశారో మీకు తెలుసా?

ప్రపంచంలోనే మొట్టమొదటి పర్సనల్ డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఇటాలియన్ కంపెనీ ఒలివెట్టి 1964లో తయారు చేసింది. దీని ధర దాదాపు రూ.రెండు లక్షలు. ఇక ల్యాప్‌టాప్ గురించి చెప్పాలంటే ప్రపంచంలోని మొట్టమొదటి ల్యాప్‌టాప్ 1981లో తయారు అయింది, దీనిని ఓస్బోర్న్ కంప్యూటర్ కార్పొరేషన్ తయారు చేసింది.

ఈ ల్యాప్‌టాప్ ఆ సమయంలో పోర్టబుల్ మైక్రో కంప్యూటర్‌గా ఉండేది. ఈ ల్యాప్‌టాప్‌లో ఐదు అంగుళాల స్క్రీన్ ఉంది. దాని బరువు 11 కిలోలుగా ఉంది. ఈ మొదటి ల్యాప్‌టాప్ బరువు ఐదు యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోలకు సమానం. అయినప్పటికీ అధిక బరువు, అధిక ధర కారణంగా ఇది పెద్దగా విజయవంతం కాలేదు. ఈ మొదటి పోర్టబుల్ ల్యాప్‌టాప్ ధర 1795 డాలర్లు అంటే నేటి రూపాయి విలువ ప్రకారం రూ.1,46,775. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్‌టాప్ విలువ దాదాపు రూ.1.5 లక్షలు అన్నమాట.

ఓస్బోర్న్ ల్యాప్‌టాప్ తర్వాత రెండో పోర్టబుల్ ల్యాప్‌టాప్ 1983లో లాంచ్ అయింది. దీనికి గ్రిడ్ కంపాస్ 1101 అని పేరు పెట్టారు. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇది మార్కెట్‌లో విజయవంతం కాలేదు. దీని తర్వాత Compaq LTE, Compaq LTE 286 ల్యాప్‌టాప్‌లు 1990లో మార్కెట్లోకి వచ్చాయి. పాత ల్యాప్‌టాప్‌ల కంటే ఇవి చాలా తేలికైనవి. వీటిని ప్రయాణంలో సులభంగా తీసుకువెళ్లవచ్చు.

యాపిల్ మొదటి ల్యాప్‌టాప్‌ 1989లో
యాపిల్ కంపెనీ ఉత్పత్తులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. యాపిల్ తన మొదటి ల్యాప్‌టాప్‌ను 1989లో లాంచ్ చేసింది. నేడు వస్తున్న Apple ల్యాప్‌టాప్‌లు తేలికగా, చిన్నవిగా ఉన్నాయి. ఆ సమయంలో యాపిల్ ల్యాప్‌టాప్ ఇప్పటి వెర్షన్ కంటే చాలా పెద్దది, భారీగా ఉంది.

దాని బ్యాటరీ, స్క్రీన్ ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. దీని తరువాత యాపిల్ 1991లో పవర్ బుక్ ల్యాప్‌టాప్ సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీ మూడు ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పవర్ బుక్ 100, పవర్ బుక్ 140, పవర్ బుక్ 170 ఉన్నాయి. 

అయితే కరోనా వైరస్ తర్వాత ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసర వస్తువుల్లోకి చేరుతున్నాయి. ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ చేయాలన్నా, ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా ల్యాప్‌టాప్ కంపల్సరీ అవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget