Jio 5G: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - 5జీ సేవలు షురూ!
జియో 5జీ సేవలు మనదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి.
రిలయన్స్ జియో 5G సేవలు శనివారం భారతదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. రెండు నెలల క్రితం ప్రకటించినట్లుగా టెలికాం ఆపరేటర్ శనివారం ఎట్టకేలకు దేశంలో కొత్త తరం హై స్పీడ్ సేవలను ప్రారంభించింది. జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ రాజస్థాన్‌లో ఉన్న రాజ్‌సమంద్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయం నుంచి సేవలను ప్రారంభించారు. ఈ సంవత్సరం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని టెల్కో లక్ష్యంగా పెట్టుకుంది.
జియో తన 5జీ నెట్‌వర్క్‌ను 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తహసీల్, తాలూకాకు విస్తరించాలని భావిస్తున్నట్లు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్టు 29న భారతదేశంలో 5జీ లాంచ్‌ను ప్రకటిస్తూ ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అంబానీ రిలయన్స్ జియో బోర్డు నుండి రాజీనామా చేసి, తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి బాధ్యతలను అప్పగించారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో నికర లాభం రూ.4,518 కోట్లు
జియో 5జీ తాజా వెర్షన్‌ను స్టాండ్ అలోన్ 5జీ అని పిలుస్తారు. 5G మౌలిక సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ జియో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో 5జీ సేవల బీటా ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు 1 Gbps కంటే ఎక్కువ డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందించనుంది.
జియో తెలుపుతున్న దాని ప్రకారం 5జీ నెట్‌వర్క్‌ను దశలవారీగా అందించనున్నారు. కంపెనీ తన స్టాండ్ అలోన్ 5G టెక్నాలజీని 'Jio True 5G'గా బ్రాండ్ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో జియో నికర లాభం 28 శాతం పెరిగి రూ.4,518 కోట్లకు చేరింది.
దాని నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.3,528 కోట్లుగా ఉన్నట్లు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.22,521 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ.18,735 కోట్లుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram