Jio Prepaid Plans: 14 ఓటీటీ యాప్స్ ఫ్రీగా అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే - మూవీ లవర్స్‌కు బెస్ట్!
Jio Best Prepaid Plans: రిలయన్స్ జియో కొన్ని ప్లాన్ల ద్వారా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తుంది. వాటితో రీచార్జ్ చేసుకుంటే ఉచిత ఓటీటీ యాప్స్‌తో పాటు అదనపు డేటా కూడా లభిస్తుంది.
Reliance Jio: రిలయన్స్ జియో తన వినియోగదారులకు అనేక గొప్ప ప్లాన్‌లను అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించడానికి ఇష్టపడతారు. 14కు పైగా ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్‌ను అందించే జియో ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
జియో రూ.398 ప్లాన్ (Jio Rs 398 Plan)
రిలయన్స్ జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్లలో రూ.398 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఇది రోజుకు 2 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇవన్నీ కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌లో 6 జీబీ అదనపు డేటాను కూడా పొందుతారు. దీని వాలిడిటీ కూడా 28 రోజులుగానే ఉంది.
మీ రోజువారీ డేటా పరిమితి అయిపోతే ఆటోమేటిక్‌గా 6 జీబీ అదనపు డేటా అందుబాటులోకి వస్తుంది. ఎక్కువ డేటాను వాడే వినియోగదారులకు ఇటువంటి అదనపు డేటా అందించే ప్లాన్లు చాలా మంచివని చెప్పవచ్చు.
జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్‌నెక్స్ట్, కంచా లంక, ప్లానెట్ మరాఠీ, డాక్యుబే, ఎపిక్ ఆన్, హోయ్‌చొయ్ వంటి ఓటీటీ యాప్స్‌తో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ సర్వీసులకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
జియో రూ.1198 ప్లాన్ (Jio Rs 1198 Plan)
జియో అందిస్తున్న రూ. 1198 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. దీంతో రోజువారీ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 18 జీబీ అదనపు డేటాను పొందుతారు.
ఇది మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియంతో సహా మొత్తం 14 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. వీటన్నింటితో పాటు ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ట్రూలీ అన్‌లిమిటెడ్ 5జీ సౌకర్యం కూడా లభించనుంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
జియో రూ. 4498 ప్లాన్ (Jio Rs 4498 Plan)
ఈ జాబితాలో జియో తదుపరి ప్లాన్ రూ.4498. దీని వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 2 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు 78 జీబీ అదనపు డేటా కూడా లభిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ మొబైల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియంతో సహా మొత్తం 14 ఓటీటీ యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. వీటన్నింటితో పాటు ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ట్రూలీ అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది.
జియో రూ.749 ప్లాన్ (Jio Rs 749 Plan)
ఈ జాబితాలో జియో అందిస్తున్న తదుపరి ప్లాన్ రూ. 749. దీని వాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, రోజుకు 2 జీబీ డేటా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఏకంగా 20 జీబీ అదనపు డేటాను పొందుతారు.
ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సౌకర్యాలను కూడా పొందుతారు. అయితే అదనంగా ఎటువంటి ఓటీటీ యాప్స్ లభించవు. ఇది కాకుండా ప్రస్తుతం జియో అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అంటే 5జీ అందుబాటులో ఉన్న చోట ఫ్రీగా 5జీని వాడుకోవచ్చన్న మాట.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు