By: ABP Desam | Updated at : 23 Oct 2022 06:11 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
భారత్ లో ఇప్పుడిప్పుడే 5G సేవలు విస్తృతం అవుతున్నాయి. తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఆయా టెలికాం సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రోజు రోజుకు ఇతర నగరాలకు 5G సర్వీసులను విస్తరిస్తూ పోతున్నాయి. దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ తో విస్తృత కవరేజీ కోసం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సెటప్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జియో మరో ముందడుగు వేసింది. 4G ఫోన్లు సైతం 5G సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. Wi-Fi ద్వారా చాలా మందికి 5G సర్వీసులను అందుకునే వెసులుబాటు అందిస్తోంది. తాజాగా ఈ టెలికాం ఆపరేటర్ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో సరికొత్త 5G Wi-Fi సేవలను మొదలు పెట్టింది. కీలక ప్రాంతాల్లో Wi-Fi నెట్ వర్క్ ల ద్వారా వినియోగదారులకు 5G వేగాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థలు, పుణ్య క్షేత్రాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమర్షియల్ హబ్‌లు, సహా పలు ప్రాంతాలలో Jio True 5G-ఆధారిత Wi-Fi సేవలను Jio అందిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుత 4G నెట్ వర్క్ సపోర్టు చేసే మోబైల్ వినియోగదారులు కూడా 5G నెట్‌వర్క్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
Jio 5G ఆధారిత Wi-Fi సేవలు, Jio 5G మొబైల్ నెట్‌వర్క్ ను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి వంటి ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించిన 5G నెట్‌వర్క్ అత్యంత మెరుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 5G సేవలను జియో దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో చెన్నై కూడా చేరింది.
Jio 5G ఆధారిత Wi-Fi సేవలు రిలయన్స్ జియో వినియోగదారులందరికీ ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. Jio యేతర వినియోగదారులు కూడా ఈ Wi-Fi హాట్ స్పాట్ లో 5G సేవలను యాక్సెస్ చేయగలరు. కానీ, ఎక్కువ స్పీడ్ తో సేవలను అందుకోలేరు. తక్కువ కెపాసిటీ డేటాను పొందే అవకాశం ఉంది.
Jio 5G నెట్‌వర్క్ ప్రారంభ స్పీడ్ టెస్ట్‌లలో మంచి ఫలితాలను చూపించింది. Airtel 5G నెట్‌వర్క్‌తో పోలిస్తే, Jio యొక్క 5G నెట్‌వర్క్ సాధారణంగా 400-500 Mbps వేగాన్ని అందిస్తోంది. ఇది ప్రస్తుత 4G వేగం కంటే చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, Jio స్వతంత్ర 5G నెట్ వర్క్ ను ఉపయోగిస్తోంది. అంటే ఇది పూర్తిగా 5G నెట్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. మరింత కవరేజీని అందించడానికి బ్యాకప్ గా 4Gపై ఆధార పడదు. మార్చి 2024 నాటికి 5G సేవలు దేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంటాయని జియో ఇప్పటికే వెల్లడించింది.
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి