Smartphone Under Rs 6000: ఐటెల్ కొత్త ఫోన్ వచ్చేసింది - ధర రూ.6 వేలలోపే!
Itel A27 Launched: ఐటెల్ ఏ27 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.5,999గా నిర్ణయించారు.
Itel A27 India Launch: ఐటెల్ ఏ27 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 5.45 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 4జీ కనెక్టివిటీ, డ్యూయల్ వోల్టే సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) (Android 11 Go Edition) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని ప్రాసెసర్ వివరాలు తెలియరాలేదు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
ఐటెల్ ఏ27 ధర (Itel A27 Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.5,999గా ఉంది. క్రిస్టల్ బ్లూ, డీప్ గ్రే, సిల్వర్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండనుందని కంపెనీ తెలిపింది.
ఐటెల్ ఏ27 స్పెసిఫికేషన్లు (Itel A27 Specifications)
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.45 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 1.4 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు 5 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ముందువైపు 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉందో, లేదో తెలియరాలేదు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram