iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త మార్పులు - ఈసారి భారీ డిస్‌ప్లేతో!
iPhone 16 Leaks: ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి భారీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.
Apple iPhone 16 Series: యాపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌పై టెక్ లవర్స్‌కు మంచి ఇంట్రస్ట్ ఉంది. ఈసారి కొత్త ఫోన్‌లో ప్రత్యేకంగా ఏం అందించనున్నారనే అంశంపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. ఈ క్రమంలో ఐఫోన్ 16కి సంబంధించి లీకైన రిపోర్ట్ బయటకు వచ్చి యూజర్ల ఆసక్తిని మరింత పెంచింది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో కంపెనీ కొత్త కెమెరా సెటప్‌ను అందించబోతోందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త లీకులు బయటకు వచ్చాయి.
ఏం లీకయ్యాయి?
ప్రముఖ టిప్‌స్టర్ సోనీ డిక్సన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఐఫోన్ 16కు సంబంధించిన కేస్‌లు అని రెండు పారదర్శక కేస్‌లను చూపించారు. ఈ ట్రాన్స్‌పరెంట్ కేస్ పర్పుల్ ఎడ్జ్‌లను కలిగి ఉంది. కెమెరా బంప్ కోసం ఓవల్ ఆకారపు కటౌట్‌ను కలిగి ఉంది.
ఈ సిరీస్‌లో ప్రత్యేకత ఏమిటి?
దీనికి ముందు కూడా బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ఐఫోన్ 16 సిరీస్ గురించి తెలిపాడు. దాని కెమెరా నిలువుగా ఉండవచ్చని చెప్పారు. ఈ తరహా డిజైన్ ఇప్పటికే iPhone Xలో కూడా చూశాం. ఐఫోన్ 16 డిస్‌ప్లే మునుపటి మోడళ్ల కంటే పెద్దదిగా ఉంటుందని చెప్పాడు.
గుర్మాన్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే సైజు 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్‌ప్లే సైజు 6.9 అంగుళాలతో అందుబాటులో ఉంటుంది. సైజు కాకుండా ఐఫోన్ డిజైన్‌లో కూడా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 15 మోడళ్లలో ఉన్న యాక్షన్ బటన్‌ను యాపిల్ ఈ సిరీస్‌లో కూడా అందించగలదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. దాని కొత్త సిరీస్‌లో కంపెనీ క్యాప్చర్ బటన్‌ను చేర్చవచ్చు. ఇది ఫిజికల్ కెమెరా షట్టర్‌ను పోలి ఉంటుంది. ఇది కాకుండా కెమెరా గురించి చెప్పాలంటే ఈ కొత్త సిరీస్ ఐఫోన్ కెమెరా మరింత మెరుగ్గా ఉంటుంది. ఫోన్‌లో అనేక ఏఐ ఫీచర్లను కూడా చూడవచ్చు.
మరోవైపు ఎప్పటిలాగా నాలుగు మోడల్స్ కాకుండా ఈసారి ఐదు మోడల్స్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుందని గతంలో వార్తలు వచ్చాయి. 6.7 అంగుళాల సైజు ఉండే ‘ప్లస్ ఎస్ఈ’ మోడల్‌ను ఈ సిరీస్‌లో యాపిల్ ప్రపంచ మార్కెట్లోకి తీసుకురానుందని సమాచారం. సోషల్ మీడియాలో ఒక యూజర్ ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను టీజ్ చేశారు. ఈ వార్తలను బట్టి చూస్తే ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16 ఎస్ఈ, ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయని మనం అనుకోవచ్చు. 2023 సంవత్సరంలో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్క కూడా మారనుందని అనుకోవచ్చు. ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌ల్లో సాధారణంగా వెనకవైపు ఒక కెమెరానే అందిస్తారు. కాబట్టి ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ డిజైన్‌ల్లో ఒక కెమెరానే వెనకవైపు ఉండే అవకాశం ఉంది.
Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?