అన్వేషించండి

Iphone 16: ఆ స్పెషల్ డేనే ఐఫోన్​ 16 సిరీస్​ లాంఛ్​! - ఆ రోజు ఇంకా ఏమేం రాబోతున్నాయంటే?

మోస్ట్​ అవైటెడ్​ స్మార్ట్ ​ఫోన్స్​ లాంఛ్​లో ఒకటైన ఐఫోన్​ 16 సెప్టెంబర్‌ 10వ తేదీన  ఈవెంట్‌ నిర్వహించి లాంచ్ చేస్తున్నారు.

Apple Event 2024: యాపిల్ కొత్త ప్రొడక్టుల రాక కోసం టెక్‌ ప్రియుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రొడక్ట్​కు సంబంధించిన గ్యాడ్జెట్స్​ను, ఇతర ప్రొడక్ట్స్​ను కొన్నా, కొనకపోయినా వాటి ధరలు, ఫీచర్లు గురించి తెలుసుకోవడానికి కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తుంటారు. 

అయితే తాజాగా యాపిల్​ లవర్స్​కు ఓ సూపర్​ అప్డేట్​!  అదేంటంటే ఈ ఏడాది మోస్ట్​ అవైటెడ్​ స్మార్ట్ ​ఫోన్స్​ లాంఛ్​లో ఒకటైన ఐఫోన్​ 16 సిరీస్​కు సంబంధించి ఓ సూపర్​ వార్త బయటకి వచ్చింది. అదేంటంటే సెప్టెంబర్‌ 10వ తేదీన  ఈవెంట్‌ నిర్వహించే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఈ ఈవెంట్​ కోసం అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా వేగంగా చేస్తున్నట్లు సమాచారం అందింది. 

ఈ సారి ఎప్పుడంటే? - సాధారణంగా యాపిల్ ఎప్పుడూ సెప్టెంబర్‌ రెండో వారంలో  ఈ ఈవెంట్‌ను నిర్వహించేలా ప్లాన్ చేస్తుంటుంది.  గతేడాది సెప్టెంబర్‌ 12న నిర్వహించగా, అంతకుముందు 2022లో సెప్టెంబర్‌ 7న కండక్ట్‌ చేసింది. అయితే ఈ సారి సెప్టెంబర్‌ 10న ఈవెంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్​ 10న నిర్వహించే ఈ ఈవెంట్​లో కొత్త ఐఫోన్​ సిరీస్​ను  లాంఛ్​​ చేయనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్​బర్గ్​ తాజాగా వెల్లడించింది. 

నాలుగు వేరియంట్లలో :  ఈ ఐఫోన్‌ 16 సిరీస్‌లో నాలుగు ఫోన్లు విడుదల కానున్నాయి.  స్టాండర్డ్‌ వేరియంట్‌తో పాటుగా ఐఫోన్‌ 16 ప్లస్‌, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌  రానున్నాయి. యాపిల్‌ ఏ18 ప్రో చిప్‌సెట్‌తో రావొచ్చు. ఈ నాలుగు ఫోన్లూ వేర్వేరు సైజుల్లో ఉండడంతో పాటు, వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో పనిచేస్తాయి. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఇంకా ఏం రాబోతున్నాయో తెలుసా? - ఈ ఐఫోన్ 16 సిరీస్​ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, యాపిల్​ ఎయిర్‌పాడ్స్‌ 4, యాపిల్ ఎయిర్​పాడ్స్​ మ్యాక్స్ 2లను లాంఛ్​ చేస్తారని సమాచారం అందింది. ఇంకా ఐఓఎస్ 18 కూడా వస్తుందని సమాచారం. వీటిలో పాటే మాక్​లను ఒక నెల తర్వాత అక్టోబర్​లో ప్రత్యేక ఈవెంట్ ​ ద్వారా విడుదల చేస్తారని తెలిసింది. ఇకపోతే సెప్టెంబర్ 20 నుంచి యాజర్స్​, ఐఫోన్ ప్రియులు  కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చని సమాచారం. 

సెప్టెంబర్ 10నే ఎందుకంటే? -  కొత్త ఐఫోన్​ లాంచ్​ చేసేందుకు మంగళ, బుధవారాలను యాపిల్ ఎంచుకుంటుంటుంది. ఈవెంట్​కు ముందు రోజు (సోమవారం) కూడా పని దినం ఉండేలా చూసుకుంటుంది. అయితే, సెప్టెంబర్ మొదటి సోమవారం యూఎస్​లో లేబర్ డే కాబట్టి ఆరోజు సెలవు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈవెంట్​ను సెప్టెంబర్ రెండో వారానికి షెడ్యూల్​ చేసింది యాపిల్. రెండోవారంలో వచ్చే సోమవారం వర్కింగ్ డే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10(మంగళవారం)న ఐఫోన్​ 16 సిరీస్ లాంఛ్ ఈవెంట్​ను ఖరారు చేసినట్లు సమాచారం.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget