(Source: ECI/ABP News/ABP Majha)
iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో కెమెరాలో భారీ మార్పులు - డిజైన్‌లో కూడా!
ఐఫోన్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ కెమెరాలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
iPhone 16 Pro: 2023 సెప్టెంబర్‌లో యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ ప్రారంభించిన తర్వాత యాపిల్ త్వరలో తీసుకురానున్న సిరీస్ గురించి వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది తైవాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎకనమిక్ డైలీ న్యూస్‌ను వార్తను కోట్ చేస్తూ ఇచ్చిన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యాపిల్ తన రాబోయే సిరీస్‌లో డిజైన్‌ను మార్చబోతోంది మరియు కంపెనీ కెమెరాలో కొన్ని నవీకరణలను తీసుకురాబోతోంది.
ఐఫోన్ 16 ప్రో కెమెరాలో మార్పులు (iPhone 16 Pro Camera Leaks)
కొత్త ఐఫోన్ 16 ప్రో లెన్స్‌లో కొన్ని మార్పులు జరగనున్నాయని నివేదిక తెలిపింది. ప్రస్తుతానికి ఈ మార్పు ఐఫోన్ 16 ప్రోలో మాత్రమే జరుగుతుందా లేదా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో కూడా మార్పులు చేస్తాయా అనే అధికారిక సమాచారం లేదు.
పాత మోడళ్లకు భిన్నంగా కొత్త మోడల్‌కు భిన్నంగా కెమెరా, లెన్స్‌లో యాపిల్ మార్పులు చేయనున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. ప్రో మోడల్స్‌లో కంపెనీ అధునాతన మోల్డెడ్ గ్లాస్ లెన్స్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది నేరుగా స్మార్ట్‌ఫోన్ డిజైన్‌నే మారుస్తుంది. లెన్స్ చిన్నవిగా ఉంటాయని, కానీ మెరుగైన ఆప్టికల్ జూమ్‌ను అందజేస్తాయని, ఇది మంచి ఫోటోలను తీయడంలో సాయపడుతుందని పేర్కొన్నారు.
ఇంకా ఈ మార్పు టెలిఫోటో లెన్స్‌లో మాత్రమే కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మధ్య తేడా కేవలం కెమెరాల్లో, స్క్రీన్ సైజులో మాత్రమే ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో ప్రధాన లెన్స్‌తో పోలిస్తే 3x ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది, అయితే ప్రో మాక్స్ టెలిఫోటో లెన్స్‌లో ఉన్న టెట్రాప్రిజం కారణంగా 5x జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది.
మరోవైపు ఇండియాటుడే నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 16 (iPhone 16) బేస్ మోడల్‌లలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ బేస్ మోడల్‌లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే యాపిల్ అందిస్తూ వచ్చింది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే యాపిల్ అందించనుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల్లో 6.1, 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
యాపిల్ ప్రారంభంలో ఐఫోన్ 15 ప్రో లైనప్‌తో సాలిడ్ స్టేట్ బటన్‌ను పరిచయం చేయాలని అనుకుంది. ఇది ఐఫోన్ ఎస్ఈ సిరీస్ హోమ్ బటన్‌లో కనిపించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ తరహాలో ఉంటుంది. ఐఫోన్ 15 ప్రోలో కంపెనీ దీన్ని అందించలేక పోయినప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్లో కంపెనీ సాలిడ్ స్టేట్ బటన్‌ను అందించే అవకాశం ఉందని ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్ చి కుయో తెలిపారు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?