Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
Infinix Hot 30i: ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజుల స్టాండ్‌బై టైంను ఇది అందించనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ ధర
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఇది స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ అంటోంది. ఈ ధర ఎంత వరకు ఉంటుందో తెలియరాలేదు. డైమండ్ వైట్, గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. దీని స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్లు రూ.317 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐలో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ముందువైపు, వెనకవైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌లను అందించారు.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, ఓటీజీ, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. ఫేస్ అన్‌లాక్ ద్వారా కూడా ఫోన్ ఓపెన్ చేయవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజుల స్టాండ్‌బై టైం, 25 గంటల కాలింగ్ టైమ్‌ను ఇది అందించనుంది. యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ - కంపాస్, గైరోస్కోప్, జీ - సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఈ ఫోన్‌లో అందించారు.