JioCloud Updates: జియో క్లౌడ్‌లో ఫైల్స్ స్టోర్ చేయడం ఎలా - ఏకంగా 100 జీబీ ఫ్రీ!
JioCloud Files Upload: రిలయన్స్ జియో ఇటీవలే మనదేశంలో క్లౌడ్ సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులకు 100 జీబీ వరకు ఫ్రీ స్టోరేజ్ అందించనున్నారు.

JioCloud: రిలయన్స్ ఇటీవల జియో క్లౌడ్ సర్వీసును ప్రారంభించింది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద జియో వినియోగదారులకు 100 జీబీ వరకు ఉచిత స్టోరేజ్ స్పేస్ లభించనుంది. జియో క్లౌడ్ వచ్చిన తర్వాత గూగుల్, ఐక్లౌడ్ సర్వీసుల టెన్షన్ ఖచ్చితంగా పెరిగింది. గూగుల్ తన వినియోగదారులకు 15 జీబీ ఉచిత నిల్వను అందజేయనుంది. ఐక్లౌడ్‌లో వినియోగదారులకు 5 జీబీ ఉచిత స్టోరేజ్ స్పేస్ మాత్రమే లభించనుంది.
ఇటువంటి పరిస్థితిలో జియో అందిస్తున్న 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ అనేది వినియోగదారులకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం జియో క్లౌడ్‌లో మీడియా ఫైల్‌లను ఎలా అప్‌లోడ్ చేయాలి అనే సందేహం రావడం చాలా సహజం. జియో క్లౌడ్‌లో ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం చాలా సులభం. మీరు కూడా జియో క్లౌడ్‌లో ఫైల్‌లను సులభంగా ఎలా అప్‌లోడ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో క్లౌడ్‌లో మీడియా ఫైల్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి?
జియో క్లౌడ్‌లో మీడియా ఫైల్ప్ అప్‌లోడ్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
మీరు ఫైల్స్ లేదా కంటెంట్‌ను కస్టమైజ్డ్‌గా కాకుండా మొత్తం డేటాను అప్‌లోడ్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ స్క్రీన్‌కి వెళ్లి ఆటో బ్యాకప్ స్క్రీన్‌లో 'ఆటో బ్యాకప్'ని ఆన్ చేసి, మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న ఫైల్ టైప్స్‌ను ఎంచుకోండి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మీరు ఫోటోలు, వీడియోలు, సంగీతం లేదా డాక్యుమెంట్స్‌ను మాత్రమే స్టోరేజ్ చేయాలనుకుంటే ఫైల్స్ స్క్రీన్‌పై 'అప్‌లోడ్ (+)' బటన్‌ను క్లిక్ చేసి మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్స్‌ను ఎంచుకోండి.
డెస్క్‌టాప్ నుంచి ఫైల్‌లను ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవసరమైన ఫైల్‌ను మీ పీసీ లేదా మాక్‌లోని జియో క్లౌడ్ ఫోల్డర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి. వెబ్ నుంచి ఫైల్స్ అప్‌లోడ్ చేయడానికి, 'అప్‌లోడ్ ఫైల్స్' ఎంపికపై క్లిక్ చేయండి.
మీరు ఒకేసారి ఎక్కు ఫైల్స్ లేదా ఫోల్డర్‌లను అప్‌లోడ్ చేయాలనుకుంటే జియోక్లౌడ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న బల్క్ అప్‌లోడర్‌ను ఉపయోగించవచ్చు.
క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి?
క్లౌడ్ స్టోరేజ్ అనేది కంప్యూటర్ డేటా స్టోరేజ్‌లొ ఒక పద్ధతి. ఇందులో డేటా డిజిటల్‌గా స్టోర్ అవుతుంది. దీనిలో యూజర్ ఫోన్ లేదా డివైస్ నుంచి వేరుగా ఉన్న సర్వర్‌లో డేటాను నిల్వ చేస్తారు. ఈ సర్వర్‌ల నిర్వహణ థర్డ్ పార్టీ ప్రొవైడర్ ద్వారా జరుగుతుంది. దీంతో పాటు ప్రొవైడర్ తన సర్వర్‌లోని డేటాను పబ్లిక్ లేదా ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఎల్లప్పుడూ యాక్సెస్ చేయగలరు. క్లౌడ్ స్టోరేజ్ అనేది డేటాను స్టోర్ చేసుకోవడానికి ఒక సేఫెస్ట్ ఆప్షన్ కూడా అని చెప్పవచ్చు.
Shri Mukesh Ambani announces the Jio AI Cloud "WELCOME" Offer starting Diwali this year.#RILAGM2024 #WelcomeOffer #JioAICloud #100GB #FreeCloudStorage #WithLoveFromJio #RILAGM #RelianceForAll #Jio #Sustainability pic.twitter.com/oUUH39npgM
— Reliance Jio (@reliancejio) August 29, 2024
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

