News
News
X

WhatsApp tips and tricks: వాట్సప్ టిప్స్ - మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు చూపించాలంటే ఇలా చేయండి

వాట్సాప్.. తన వినియోగదారుల కోసం ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వాట్సాప్ వినియోగిస్తున్న సమయంలోనూ ఆన్ లైన్ స్టేటస్ ను హైడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

FOLLOW US: 

సాధారణంగా మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే.. ఎదుటి వాళ్లకు మనం ఆన్ లైన్ లో ఉన్నట్లు చూపిస్తుంది. ఆ సమయంలో మనకు వాళ్లు మెసేజ్ చేస్తే.. మనం రిప్లై ఇవ్వకపోతే వాళ్లు ఫీలవుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే జస్ట్ కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది. మీరు 24 గంటలు ఆన్ లైన్ లో ఉన్నా.. ఎదుటి వారికి కనిపించదు. కావాలనుకుంటే మీరు ఎదుటి వారి మెసేజ్ లకు రిప్లై ఇవ్వొచ్చు. లేదంటే చూసి వదిలేయవచ్చు. ఇందుకు మీరు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.

త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్

వాట్సాప్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. వాట్సాప్ వినియోగిస్తున్న సమయంలోనూ ఆన్ లైన్ స్టేటస్ ను దాచుకునే అవకాశాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ ఫాం తెలిపింది. ఇంతకీ మన ఆన్ లైన్ స్టేటస్ ఎలా కనిపించకుండా చేయాలంటే..

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

⦿ మొదట, మీ ఫోన్‌ లో WhatsApp యాప్‌ ని తెరవండి.

⦿ వాట్సాప్‌లో పైన కుడి వైపు ఉన్న మూడు నిలువు చుక్కలను క్లిక్ చేయాలి.

⦿ ఆ తర్వాత సెట్టింగ్స్ మెనుపై క్లిక్ చేయాలి.

⦿ ఇప్పుడు, ఖాతా ఎంపికపై క్లిక్ చేసి, ఆపై ప్రైవసీ సెలక్ట్ చేయండి.

⦿ ఆ తర్వాత లాస్ట్ సీన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇందులో రెండు ఎంపికలు ఉంటాయి. ఒకటి తన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారు మాత్రమే చూడకూడదని, రెండోది ఎవరూ చూడకూడదని ఉంటాయి. తొలి ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీ ఆన్‌ లైన్ స్టేటస్.. మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండవ ఎంపిక చేస్తే.. ఎవరికీ ఆన్ లైన్ స్టేటస్ కనిపించదు. అంతేకాదు.. మీరు కూడా మీ స్నేహితుడి ఆన్‌ లైన్ స్టేటస్ ను చూడలేరు. ప్రస్తుతం ఇది వాట్సాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా మెసేజింగ్ యాప్స్‌లో ఈ ఆప్షన్ వచ్చేందుకు టైమ్ పట్టవచ్చు. 

ప్రైవసీని కాపాడుకునే అవకాశం

మరికొద్ది వారాల్లో వాట్సాప్ అధికారికంగా హైడ్ ఆన్‌ లైన్ స్టేటస్ ఫీచర్‌ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నది. అప్పటి వరకు వెయిట్ చేస్తే మరింత మెరుగైన పద్దతిలో ఆన్ లైన్ స్టేటస్ ను హైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ  ఫీచర్‌ను ప్రకటించిన సమయంలో,  వినియోగదారులు ఆన్‌ లైన్ స్టేటస్ ను  ప్రైవేట్‌ గా ఉంచాలనుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది. వాస్తవానికి మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ ఆగస్టులో వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ ను అందుబాటలోకి తీసుకొస్తామని ప్రకటించింది. కానీ టెస్టింగ్ ప్రాబ్లం మూలంగా కాస్త ఆలస్యం అయ్యింది. ఈ నెలలో హైడ్ ఆన్‌ లైన్ ఫీచర్‌ ను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. WhatsAppని తెరిచి సెట్టింగ్‌లు > అకౌంట్> ప్రైవసీలోకి వెళ్లాలి. ఆన్ లైన్ ను హైడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 06 Sep 2022 10:20 AM (IST) Tags: WhatsApp Whatsapp Tips Whatsapp Tricks online status

సంబంధిత కథనాలు

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Hisense U7H TV Series: సూపర్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్‌తో హైసెన్స్ కొత్త టీవీలు - ధర ఎంతంటే?

Hisense U7H TV Series: సూపర్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్‌తో హైసెన్స్ కొత్త టీవీలు - ధర ఎంతంటే?

Google Pixel 7 Price: గూగుల్ కొత్త ఫోన్ రేట్ లీక్ - ఈసారి యాపిల్ రేంజ్‌లో!

Google Pixel 7 Price: గూగుల్ కొత్త ఫోన్ రేట్ లీక్ - ఈసారి యాపిల్ రేంజ్‌లో!

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!

Whatsapp Call Links : వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Whatsapp Call Links :  వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు