అన్వేషించండి

Whatsapp Feature: వాట్సాప్‌లో అద్భుత ఫీచర్ - లోలైట్ వీడియో కాలింగ్ మోడ్ సిద్ధం, ఎలా యాక్టివేట్ చెయ్యాలో తెలుసా!

Whatsapp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. వినియోగదారులు తక్కువ లైట్ మోడ్‌లోనూ మెరుగైన వీడియో కాల్స్ చేసుకునేలా ఫీచర్ రూపొందించింది.

Low Light Video Calling Mode In Whatsapp: వాట్సాప్ (Whatsapp) తమ వినియోగదారుల కోసం మరో అద్భుత ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో తక్కువ కాంతిలో (Light Mode) మసక వెలుతురులోనూ మెరుగైన క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ అప్‌డేట్‌తో తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ వీడియో కాల్స్‌ను సులభంగా చేసుకుని ఇష్టమైన వారితో మాట్లాడుకోవచ్చు. వినియోగదారులు తక్కువ లైటింగ్ సమయంలోనూ మెరుగైన వీడియో కాల్స్ చేసేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. వీడియో కాలింగ్ సమయంలో కొత్త ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.

లైట్ మోడ్ అంటే.?

ఇది పేరుకు తగ్గట్టుగానే గదిలో కాంతి తక్కువగా ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇష్టమైన వారికి వీడియో కాల్ చెయ్యొచ్చు. వాట్సాప్‌లో వీడియో కాల్ నాణ్యత మెరుగుపరచడమే దీని లక్ష్యం. మీరు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ పరిసరాల్లోని కాంతిని పరిశీలించి అందుకు తగ్గట్లుగా వీడియో కాల్‌కు అనువుగా లైట్‌ను అడ్జస్ట్ చేస్తుంది. మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తుంది. చీకటిలో వీడియో స్పష్టతను డిస్ట్రబ్ చేసే గ్రైనినెస్‌ను తగ్గిస్తుంది. ఎలాంటి లైటింగ్‌లోనైనా మీ స్నేహితులు మిమ్మల్ని స్పష్టంగా చూడగలరు.

ఎలా యాక్టివేట్ చేయాలంటే.?

మీ ఫోన్ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి వీడియో కాల్ చేయండి. మీ వీడియోను ఫుల్ స్క్రీన్ చేయండి.
  • లో - లైట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి రైట్ సైడ్ పైన ఉన్న 'టార్చ్' గుర్తును ప్రెస్ చేయండి.
  • తర్వాత లైట్ అడ్జస్ట్ చేయడానికి బల్బు గుర్తుపై నొక్కండి. దీంతో మీకు లైట్ అడ్జస్ట్ అవుతుంది. మీకు సరిపడే కాంతి వచ్చేవరకూ దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి.

కాగా, వాట్సాప్‌లో లైట్ మోడ్ iOS, Android వెర్షన్లలో అందుబాటులో ఉంది. Windows Whatsapp యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే, వినియోగదారులు ఇప్పటికీ వారి వీడియో కాల్స్ కోసం బ్రైట్ నెస్ స్థాయిలను సర్దుబాటు చెయ్యొచ్చు. ప్రతి కాల్‌కు తక్కువ లైట్ మోడ్‌‍ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని శాశ్వతంగా ఎనేబుల్ చేసి ఉంచే ఆప్షన్ లేదు.

Also Read: iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget