iPhone 14 Pro Making Cost: ఐఫోన్ 14 ప్రో తయారీకి ఎంత ఖర్చవుతుంది? మనం ఎంతకు కొంటున్నామో తెలుసా?
iPhone 13 Pro తయారీ ఖర్చుతో పోల్చితే iPhone 14 Pro తయారీకి 3.7 శాతం ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, భారత్ లో iPhone 13 Proతో పోల్చితే 8.3 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా సరికొత్తగా ఐ ఫోన్లను అప్ డేట్ చేస్తూ వస్తోంది టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ. తాజాగా అందుబాటులోకి వచ్చిన iPhone 14 Pro తయారీకి సగటున $464 (సుమారు రూ. 38,400) ఖర్చవుతుంది. ఇది 2021 ఫ్లాగ్‌షిప్ మోడల్ iPhone 13 Proతో పోల్చితే 3.7 శాతం ఎక్కువ. కొత్త ప్రాసెసర్‌లు, మెరుగైన డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరాల ఏర్పాటు కారణంగా తయారీ ఖర్చు పెరిగినట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14 ప్రో తయారీలో దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే?
తాజా రీసెర్చ్ నోట్ ప్రకారం, ఐఫోన్ 14 ప్రో డిస్ ప్లే, కెమెరా, ప్రాసెసర్‌ల కారణంగానే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది 5nm A15 బయోనిక్ SoC నుంచి A16 బయోనిక్‌లో 4nm లితోగ్రఫీకి మారడం ద్వారా, ప్రాసెసర్‌ల ధరలో $11 (సుమారు రూ. 900) పెరుగుదలను కలిగి ఉంది. ప్రస్తుతానికి టెక్ ప్రపంచంలో అత్యంత అత్యాధునిక ప్రాసెసర్ తయారీ ప్రమాణాలలో ఒకటైన కొత్త తరం ప్రాసెసర్ రూపొందించడానికి Appleకి మరింత ఖర్చవుతుంది. 48MP ప్రైమరీ కెమెరా మాడ్యూల్, ఇతర అల్గారిథమిక్ అడ్వాన్స్‌లతో ఫోన్ తయారీ మొత్తం ఖర్చులో $6.3 (సుమారు రూ. 500) పెరగడానికి దారితీసింది. కౌంటర్ పాయింట్ ప్రకారం, iPhone 14 Pro మొత్తం ధరలో డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్ కలిపి 51 శాతం ఉండగా, iPhone 13 Proకి 47 శాతంగా ఉంది.
iPhone 14 Pro ఎంతకు అమ్ముతున్నారంటే?
iPhone 14 Pro ధర ఒక్కో దేశంలో ఒక్కో మాదిరిగా ఉంది. అమెరికాలో iPhone 13 Pro ధర($999)తో సమానంగా ఉంది. భారత్ లో iPhone 14 Pro 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,29,900గా ఉంది. అయితే, iPhone 13 Pro లాంచ్ సమయంలో ధర రూ. 1,19,900గా ఉంది. ఇది 8.3 శాతం ధర పెరుగుదలను సూచిస్తుంది. అంటే ఐఫోన్ తయారీకి అయ్యే ఖర్చుకంటే రెండింతలు ఎక్కువే మనం చెల్లిస్తున్నామన్నమాట.
iPhone 14 Pro తయారీ ఖర్చు ఎందుకు పెరిగిందంటే?
ఇక ప్రతి కాంపోనెంట్ విభాగానికి Apple బహుళ సరఫరాదారులను కలిగి ఉంది. ఉదాహరణకు, శామ్‌సంగ్ ఆపిల్ ప్రాధమిక డిస్ప్లే సరఫరాదారు, సోనీ ప్రధాన కెమెరా సెన్సార్‌ను సరఫరా చేస్తుంది. అయితే, మూడు కంపెనీలు - GSEO, లార్గాన్, సన్నీ ఆప్టికల్ ఐఫోన్ 14 ప్రో యొక్క ప్రధాన కెమెరా లెన్స్ సరఫరాదారులు. సెల్యులార్ కాంపోనెంట్‌ల కోసం, Apple సరఫరాదారులలో Broadcom, Qorvo, Qualcomm , Skyworks ఉన్నాయి. చిప్స్ విభాగంలో, కియోక్సియా, శాన్‌డిస్క్ NAND ఫ్లాష్ స్టోరేజ్ మీడియాను సరఫరా చేస్తాయి. మైక్రోన్, శామ్‌సంగ్, SK హైనిక్స్ RAM మాడ్యూల్‌లను సరఫరా చేస్తాయి. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచిన కారణంగా iPhone 14 Pro తయారీ ఖర్చు కొంత మేర పెరిగినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Read Also: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!