అన్వేషించండి

Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!

గూగుల్ క్రోమ్ వినియోగదారులు టైమ్ ఆదా, ప్రొడక్టివిటీ పెంపు, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చాలా ఎక్స్‌ టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ అనేక విధాలుగా మానవ జీవన విధానాన్ని సులభతరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం వెబ్ బ్రౌజర్‌లను వాడుతున్నారు. 2008లో ప్రవేశపెట్టిన గూగుల్ క్రోమ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటిగా కొనసాగుగోంది. క్రోమ్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఎక్స్‌ టెన్షన్స్ ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఎక్స్‌ టెన్షన్స్ సంఖ్య వేలల్లో ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన కొన్ని ఎక్స్‌టెన్సన్స్‌‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

Checker Plus

ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ఆన్‌లైన్‌లో కొన్ని హెవీ డ్యూటీ వర్క్స్ చేస్తున్నప్పుడు, Google క్యాలెండర్ పేజీని తెరవకుండానే రాబోయే ఈవెంట్‌లను వీక్షించడానికి ఈ ఎక్స్‌ టెన్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీటింగ్ నోటిఫికేషన్‌లు, రిమైండర్‌లను పొందడానికి, ఈవెంట్‌లను తాత్కాలికంగా ఆపివేయడానికి చెకర్ ప్లస్ యూజ్ అవుతుంది. సాధారణ క్యాలెండర్ ఎక్స్‌ టెన్షన్ తో పోల్చితే చెకర్ ప్లస్ 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది.

LastPass

ప్రస్తుతం ప్రతి వెబ్‌సైట్ వినియోగదారులను సైన్ అప్ చేయమని అడుగుతోంది. ఈ నేపథ్యంలో పాస్‌ వర్డ్‌లను గుర్తుంచుకోవడం చాలా గజిబిజిగా ఉంటుంది. LastPass అనేది పాస్‌వర్డ్ మేనేజర్, ఇది మీ మొబైల్, కంప్యూటర్ పరికరాల నుంచి మీ పాస్‌వర్డ్‌లన్నింటిని సేవ్ చేయడానికి, సురక్షిత యాక్సెస్‌ను అందించడానికి అనుమతిస్తుంది. పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు మాత్రమే కాకుండా, క్రెడిట్ కార్డ్ వివరాలను కూడా సురక్షితంగా సేవ్ చేసుకోవచ్చు.

Loom

ఈ ఎక్స్‌టెన్సన్స్‌‌‌తో మీ స్క్రీన్ ను ఈజీగా రికార్డు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు వారి స్క్రీన్‌లను క్యాప్చర్ చేయడానికి, కనెక్ట్ అయి ఉండటానికి ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు లూమ్‌ని ఉపయోగించి 720p, 1080p, 1440p లేదా 4K HD ఫార్మాట్‌లలో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.  

Grammarly

ఇ-మెయిల్‌ను కంపోజ్ చేయడం, నోట్స్ రాయడం కోసం ఈ భాషా సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ రాతపూర్వక సంభాషణను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా, మీ భాషా నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఎక్స్‌టెన్సన్స్‌‌‌తో చక్కగా వ్యాకరణదోషం లేకుండా నోట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. స్పెల్లింగ్ లోపాలను తనిఖీ చేయడానికి ఇది బెస్ట్ సాధనంగా మారింది.

Toggl Track

బ్యాక్-టు-బ్యాక్ డెడ్‌లైన్‌ పనులతో బిజీ అయినప్పుడు, టాస్క్‌ ల మీద టైమర్‌ను పెట్టుకోవడం ఉత్తమం. Toggl Track అనేది ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో సెట్ చేసుకునే ఒక ఎక్స్‌టెన్సన్స్‌‌. ఈ టైమర్‌ను జోడించడం వల్ల ఉత్పాదకత ట్రాకింగ్‌ను అందిస్తుంది. వినియోగదారుల సమయాన్ని ట్రాక్ చేయడానికి, ఉత్పాదకతను విశ్లేషించడానికి బాగా ఉపయోగపడుతుంది.

HyperWrite

ఔత్సాహిక రచయితలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైపర్‌రైట్ ద్వారా వినియోగదారులను 10 రెట్లు వేగంగా బ్లాగ్ పోస్ట్‌లు, ఇమెయిల్‌లు, కాపీలను రాసేందుకు ఉపయోగపడుతుంది. AI సపోర్టుతో పని చేసే ఈ ఎక్స్‌టెన్సన్స్‌‌ నిమిషాల వ్యవధిలో చాలా నోట్స్ రాస్తుంది.   

Otter.ai

AI శక్తితో, Otter.ai వినియోగదారులు వర్చువల్ సమావేశాలను ట్రాన్ స్క్రైబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌టెన్సన్స్‌‌  అత్యంత సమర్థవంతమైన లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ అప్లికేషన్‌లలో ఒకటి. ఇది Zoom, Android, Google Meet, Microsoft Teams, Cisco Webex, Android, iOS వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆంగ్లంలో అందుబాటులో ఉంది.

Print Friendly & PDF

ఈ అప్లికేషన్ వినియోగదారులకు పేపర్, ఇంక్ ను సేవ్ చేయడానికి ఉపయోగపడుతోంది. ప్రింటర్ ఫ్రెండ్లీ పేజీని ఆప్టిమైజ్ చేస్తుంది.  వినియోగదారులు ప్రింటింగ్ చేయడానికి ముందు పేజీలను సవరించవచ్చు. అనవసరమైన చిత్రాలను తీసివేయడం, టెక్ట్స్ పరిమాణాన్ని మార్చే అవకాశం ఉంటుంది.

Read Also: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

టాప్ హెడ్ లైన్స్

AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget