Alternatives To TikTok : టిక్‌టాక్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఇవే - అదే తరహాలో వీడియో క్రియేట్, ఎడిటింగ్, షేర్ చేయొచ్చు
Alternatives To TikTok : యాప్ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్ నిషేధంపై నడుస్తోన్న వివాదాల మధ్య అందుకు ప్రత్నామ్యాయ యాప్ ల కోసం చాలా మంది వెతుకుతున్నారు.

Alternatives To TikTok : పలు భద్రతా కారణాల నేపథ్యంలో చైనా మాతృ సంస్థ, సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ను అమెరికా త్వరలోనే నిషేధించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఆ దేశ సుప్రీంకోర్టు సైతం బైడెన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించడమే. టిక్ టాక్ ను జనవరి 19 నుంచి యాప్ స్టోర్స్ నుంచి తీసివేయనున్నారని సమాచారం. అమెరికాలో దాదాపు 17కోట్ల మంది వినియోగించే ఈ యాప్ ను ఎవరైనా కొనుగోలు చేస్తే తప్ప ఈ నిషేధానికి అడ్డుకట్ట పడదు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రాజకీయ తీర్మానాన్ని కొనసాగించే లక్ష్యంతో గడువును పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. అయినప్పటికీ నిషేదం మాత్రం అలాగే ఉంది. అయితే ఒకవేళ అనుకున్నట్టుగానే టిక్ టాక్ ను తొలగిస్తే ఎలా అని చింతించే యూజర్లకు అనేక ప్రత్నామ్యాయ మార్గాలున్నాయి. అందులో ప్రజాదరణ పొందిన కొన్ని యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ నోట్ (RedNote)
రెడ్ నోట్ అనేది చైనీస్ యాప్. ఇది ప్రస్తుతం ఆపిల్ యాప్ స్టోర్ లో టాప్ ఫ్రీ యాప్స్ కేటగిరీలో టాప్ లో ఉంది. మాండరిన్‌లో జియాహోంగ్షు (Xiaohongshu) అని పిలుచుకుడే రెడ్‌నోట్ విలువ 17 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇది కూడా టిక్ టాక్, పిన్‌టరెస్ట్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్ లతో సమానమైన కంటెంట్ ను అందిస్తుంది. పూర్తిగా మాండరిన్‌లో పనిచేసే ఈ యాప్‌ను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌కి సమానమైన చైనీస్ యాప్ గా అభివర్ణిస్తారు.
ఇన్‌స్టాగ్రామ్ (Instagram)
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్లు, పని తీరు పరంగా చూస్తే టిక్‌టాక్‌కి అత్యంత దగ్గరగా ఉంటుంది. టిక్‌టాక్ లో వలే ఇన్ స్టాలోనూ 90 గరిష్టంగా 90 సెకన్ల వ్యవధితో కూడిన వీడియోలను రికార్డ్, ఎడిట్ చేసేందుకు యాక్సెస్ ఉంటుంది. టిక్ టాక్ పై నిషేధం కారణంగా.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరింత పాపులర్ అవుతాయని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే టిక్ టాక్ ను బ్యాన్ చేస్తే ఆ తరహా యాప్ ల కోసం చూడడం కామనే. కంటెంట్ విషయంలో ఏ మాత్రం తగ్గని, తీసిపోని ఇన్‌స్టాగ్రామే వారికి బెస్ట్ ప్లాట్‌ఫారమ్‌గా మారుతుందని చెప్పవచ్చు.
యూట్యూబ్ (YouTube)
ఇటీవలి కాలంలో యూట్యూబ్ లోనూ షార్ట్స్ పేరుతో తక్కువ నిడివి గల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా టిక్ టాక్ కు బలమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది షార్ట్-ఫారమ్ వీడియోలను క్రియేట్ చేయడం, షేర్ర్ చేయడం కోసం సారూప్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ యాప్ లో గరిష్టంగా 60సెకన్ల నిడివి గల వీడియోను అప్లోడ్ చేసేందుకు యాక్సెస్ ఉంటుంది. భారీ యూజర్ బేస్ ఉన్న యూట్యూబ్ షార్ట్స్ (YouTube Shorts).. టిక్ టాక్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వినియోగదారులను ఆకర్షించడానికి సరిపోలుతుంది.
క్లాపర్ (Clapper)
టాప్ ఫ్రీ యాప్ లలో మూడో స్థానంలో ఉన్న క్లాపర్ అనే యాప్ అనేది వాస్తవానికి టిక్‌టాక్‌కి బలమైన పోటీదారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ప్రత్యేకించి పెద్దలకు, ముఖ్యంగా జనరేషన్స్ X, Y (మిలీనియల్స్) వారిని ఆకర్షిస్తుంది. ఇది యూజర్స్ ను షార్ట్-ఫారమ్ వీడియోలను, హోస్ట్ లైవ్ స్ట్రీమ్‌లను క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి అనుమతిస్తుంది. కంటెంట్ క్రియేషన్ పరంగా టిక్ టాక్ ను పోలి ఉన్న ఈ యాప్ ప్రధాన కార్యాలయం డల్లాస్‌కు సమీపంలో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న క్లౌడ్ సిస్టమ్‌లో మొత్తం యూజర్ డేటాను స్టోర్ చేస్తుంది. ఇది డేటా ప్రైవసీ, సెక్యూరిటీ గురించి ఆందోళన చెందే యూజర్స్ కు అదనపు భరోసాను అందిస్తుంది.
లెమన్ 8(Lemon8)
లైఫ్‌స్టైల్ కమ్యూనిటీగా పిలుచుకునే లెమన్ 8 యాప్ ప్రస్తుతం రెడ్ నోట్ తరహాలో ఆపిల్ యాప్ స్టోర్ లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రీ యాప్. 2023లో యూఎస్‌లో ప్రారంభమైన ఈ యాప్‌లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, పిన్‌టరెస్ట్‌ల నుంచి ఎలిమెంట్‌లను పొందుపరిచారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేయవచ్చు. లెమన్ 8 కూడా టిక్‌టాక్ వెనుక ఉన్న అదే మాతృ సంస్థ బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉంది. ఈ కనెక్షన్ కారణంగా, టిక్ టాక్ పై ఒకవేళ నిషేధం అమలైతే ఆ ప్రభావం లెమన్ 8పైనా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాప్ కూడా అదే కార్పొరేట్ సంస్థతో సారూప్య లక్షణాలను, సంబంధాలను పంచుకుంటుంది గనుక.
Also Read : AI Bots: ఏఐ చాట్ బాట్ లతో మీరు ఈ విషయాలు ఎప్పుడూ, ఎక్కడా షేర్ చేసుకోకండి - లేదంటే రిస్క్ తప్పదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

