అన్వేషించండి

Haier OLED Pro: ప్రీమియం టీవీపై రూ.2.1 లక్షల తగ్గింపు - థియేటర్‌ని మించిన ఎక్స్‌పీరియర్స్ ఇంట్లోనే!

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ హాయర్ మనదేశంలో తన కొత్త ప్రీమియం టీవీని లాంచ్ చేసింది. అదే హాయర్ ఓఎల్ఈడీ ప్రో.

Haier OLED Pro TV: హాయర్ కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలో 65 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. అంచులు లేని డిజైన్‌ను ఇందులో అందించారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్స్‌ను కూడా అందించారు. వాయిస్ అసిస్టెంట్ కమాండ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆటో లోలేటెన్సీ మోడ్‌ను కూడా ఇందులో అందించారు.

హాయర్ ఓఎల్ఈడీ ప్రో టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.2,39,990గా నిర్ణయించారు. అయితే కంపెనీ దీన్ని ప్రారంభ ధర అని మాత్రమే చెబుతోంది. దీని ఎమ్మార్పీ రూ.4.5 లక్షలుగా ఉంది. అంటే దాదాపు రూ.2.1 లక్షల తగ్గింపును ప్రారంభ సేల్‌లో అందించారన్న మాట. ఈ టీవీ ప్రస్తుతానికి రిటైల్ స్టోర్లలో మాత్రమే లభించనుంది.

హాయర్ ఓఎల్ఈడీ ప్రో టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 65 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్‌గా ఉండటం విశేషం. డాల్బీ విజన్ సపోర్ట్ ఇందులో అందించారు. హెచ్‌డీఆర్ కంటెంట్ ప్లేబ్యాక్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. గూగుల్ ప్లే స్టోర్‌కు యాక్సెస్ కూడా ఇందులో అందించారు.

ఇందులో 30W స్పీకర్లను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక సీఐ కార్డు స్లాట్ ఇందులో ఉండనుంది. ఇందులో క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అందించారు. బ్లూటూత్ వాయిస్ రిమోట్ ఈ టీవీతో పాటు లాంచ్ కానుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ప్రత్యేకమైన బటన్లు రిమోట్‌లో అందించారు.

మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపన్సేషన్ (ఎంఈఎంసీ) టెక్నాలజీని కూడా హాయర్ ఇందులో అందించింది. ఇది మోషన్ బ్లర్‌ను తగ్గిస్తుంది. అలాగే డైనమిక్ హెచ్‌డీఆర్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్), ఈఆర్క్, ఏఎల్ఎల్ఎంలను కూడా హెచ్‌డీఎంఐ పోర్టు ద్వారా ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు 23.2 కేజీలుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haier India (@haierindia)

టాప్ హెడ్ లైన్స్

Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Embed widget