Google Pixel 6: ఒకేఫోన్‌లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. గూగుల్ సూపర్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ తన పిక్సెల్ ఫోన్లను అక్టోబర్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను అక్టోబర్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. బ్యాటరీ షేర్(రివర్స్ చార్జింగ్) ఫీచర్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఇందులో గూగుల్ అందించనుందని సమాచారం.
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 1,440x3,120 పిక్సెల్స్ ఉన్న డిస్‌ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ప్రీ-ఇన్‌స్టాల్డ్ డిజిటల్ కార్ కీ యాప్ కూడా ఇందులో ఉండనుందని ఎక్స్‌డీఏ డెవలపర్స్ తన కథనంలో పేర్కొన్నారు.
టెన్సార్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. మాలి-జీ78 జీపీయూ, 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్1 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్386 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్586 టెలిఫొటో స్నాపర్ ఉండనుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W వైర్డ్, 23W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైఫై 6ఈ, అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ ప్రోలో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. గూగుల్ పిక్సెల్ 6లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనుండగా, ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.
ఫోన్ పైన మధ్యభాగంలో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో అందించనున్న టెన్సార్ ప్రాసెసర్లను గూగుల్ స్వయంగా రూపొందిస్తుంది. పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లలోనే మొదటిసారి వీటిని అందించనుంది. అంటే యాపిల్ తరహాలో గూగుల్ కూడా తన ప్రాసెసర్లను తనే రూపొందించుకుంటుందన్న మాట.
Also Read: PUBG New State: పబ్జీ కొత్త గేమ్ వచ్చేస్తుంది.. ఇంకా మెరుగైన గ్రాఫిక్స్, అదిరిపోయే గేమ్‌ప్లే!
Also Read: Realme Vs Redmi: రియల్‌మీ 8ఐ వర్సెస్ రెడ్‌మీ 10 ప్రైమ్.. రూ.15 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే!
Also Read: Microsoft: పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా.. మీలాంటి వాళ్ల కోసమే కొత్త టెక్నాలజీ వచ్చింది!