Google Bard: కొత్త ఫీచర్లను తీసుకువచ్చిన గూగుల్ ఛాట్‌బోట్ బార్డ్ - తెలుగులో కూడా!
గూగుల్ తన ఏఐ ఛాట్‌బోట్ బార్డ్‌కు కొత్త ఫీచర్లు యాడ్ చేసింది.
Google Bard New Features: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. ఛాట్ జీపీటీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో గూగుల్ కూడా సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాట్ బోట్ బార్డ్‌ను రూపొందించింది. గూగుల్ బార్డ్ ఇప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.
హిందీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఉర్దూ మొదలైన 40 భాషలలో గూగుల్ అందుబాటులోకి వచ్చింది. కేవలం భాషలను జోడించడమే కాకుండా కంపెనీ ఈ ఛాట్ బోట్‌ను బ్రెజిల్‌తో పాటు యూరప్ అంతటా అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉంచింది.
మార్చి నెలలో గూగుల్ బార్డ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మొదటగా అమెరికా, యూకేల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దాని కోడింగ్‌ను కూడా గూగుల్ ఏప్రిల్‌లో అప్‌డేట్ చేసింది. గూగుల్ ఐ/వో ఈవెంట్‌లో దీని ద్వారా ఇమేజ్ సెర్చ్ కూడా చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు మరికొన్ని ఫీచర్లు తీసుకువచ్చింది.
గూగుల్ బార్డ్ కొత్త ఫీచర్లు
ఆడియో ద్వారా రెస్పాన్స్ వినవచ్చు : ఇప్పుడు మీరు గూగుల్ బార్డ్ రెస్పాన్స్‌ను ఆడియో ద్వారా వినవచ్చు. అంటే మీరు అడిగిన ప్రశ్నకు గూగుల్ బార్డ్ ఇచ్చిన రెస్పాన్స్ ఆడియో ద్వారా కూడా వినే అవకాశం లభిస్తుందన్న మాట. దీంతో వినియోగదారులు కష్టమైన పదాలు ఎలా మాట్లాడాలో అర్థం చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. రెస్పాన్స్‌ను వినడానికి మీరు సౌండ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
రెస్పాన్స్‌ను మార్చవచ్చు : ఇప్పుడు మీరు బార్డ్ ప్రతిస్పందనను సులభంగా, పొడవుగా, పొట్టిగా, ప్రొఫెషనల్‌గా, సాధారణమైనదిగా మార్చవచ్చు. ఇది కాకుండా మీరు ఏదైనా సంభాషణను పిన్ చేయగలరు. దాని పేరు మార్చగలరు.
ఇప్పుడు మీరు గూగుల్ బార్డ్‌లో ఫొటోల ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు. బార్డ్... గూగుల్ లెన్స్‌కి కనెక్ట్ అయింది. దీని సహాయంతో మీరు ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. మీరు బార్డ్ ప్రతిస్పందనలను ఎవరితోనైనా సులభంగా షేర్ చేసుకోవచ్చు. దీని కోసం కంపెనీ షేర్ ఆప్షన్ ఇచ్చింది. వినియోగదారులు ఇప్పుడు పైథాన్ కోడ్‌ని గూగుల్ కొలాబ్ ద్వారా రెప్లిట్‌లో ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.
ఎలాన్ మస్క్ ఛాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌లకు పోటీగా తన సొంత ఏఐ కంపెనీని తీసుకువచ్చాడు. దీని పేరు ఎక్స్ఏఐ (XAI). ఇది ఏఐతో అసోసియేట్ అయిన అనేక మంది అనుభవజ్ఞులను కలిగి ఉంది. మస్క్ స్థాపించిన ఈ సంస్థ ఉద్దేశ్యం "ప్రపంచం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం".
So #GoogleBard just dropped in EU today. 👀
— FATAL EXIT.AI (@FatalDotAI) July 13, 2023
And seeing as it's called Bard this is the first thing I tried with it... Sound on! 🎧🔊
Inspired by @omen_ahead's YouTube challenges with ChatGPT. pic.twitter.com/E61A1nJ8QT
Next time before u sign on any terms and conditions, u may want to consider using #chatgpt or #googlebard to flag on anything that’s non standard. #AI #GenerativeAI pic.twitter.com/tNeo4JGvMb
— Alvin Foo (@alvinfoo) July 9, 2023
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial