Samsung New Soundbar Lineup: ఈ సౌండ్ బార్ల కంటే టీవీలే తక్కువ రేటు - కానీ ఫీచర్లు మాత్రం అదుర్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త సౌండ్ బార్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.
శాంసంగ్ మనదేశంలో కొన్ని సౌండ్ బార్స్ లాంచ్ చేసింది. ప్రపంచంలో వైర్‌లెస్ డాల్బీ అట్మాస్‌తో లాంచ్ అయిన మొదటి సౌండ్ బార్స్ ఇవే. ఇందులో మొత్తంగా ఏడు కొత్త సౌండ్ బార్లు ఉన్నాయి.ఎస్-సిరీస్, క్యూ-సిరీస్‌లో ఈ సౌండ్ బార్లు లాంచ్ అయ్యాయి.
శాంసంగ్ 2022 సౌండ్ బార్ లైనప్ ధర
వీటిలో ఎస్-సిరీస్ సౌండ్ బార్‌లు తక్కువ ధరలో లాంచ్ అయ్యాయి. ఎస్61బీ ధరను రూ.24,990గానూ, ఎస్801బీ ధరను రూ.42,990గానూ నిర్ణయించారు. ఇక క్యూ-సిరీస్‌లో క్యూ600బీ ధర రూ.31,990గానూ, క్యూ700బీ ధర రూ.34,990గానూ, క్యూ800బీ ధర రూ.45,990గానూ, క్యూ930బీ ధర రూ.84,990గానూ, క్యూ990బీ ధర రూ.99,990గానూ ఉంది.
శాంసంగ్ 2022 సౌండ్ బార్ లైనప్ స్పెసిఫికేషన్లు
ఈ కొత్త సౌండ్ బార్లలో వైర్‌లెస్ డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను అందించారు. వీటిలో క్యూ-సింఫనీ, స్పేస్‌ఫిట్ సౌండ్ అడ్వాన్స్, 3డీ ఆడియో, డీటీఎస్ఎక్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. క్యూ-సింఫనీ ఫీచర్ ద్వారా ఈ స్పీకర్లు శాంసంగ్ టీవీ స్పీకర్లతో కంపాటిబుల్ అవుతాయి. ఎస్-సిరీస్ సౌండ్ బార్లు సన్నటి డిజైన్‌తో రానున్నాయి. వీటిలో ఎస్801బీ సౌండ్ బార్‌ను ప్రపంచంలోనే సన్నటి సౌండ్ బార్ అని కంపెనీ ప్రకటించింది.
క్యూ990బీ ఫ్లాగ్‌షిప్ సౌండ్ బార్ 11.1.4 చానెల్ బేస్‌ను అందించనుంది. క్యూ930బీలో 9.1.4 చానెల్ స్పీకర్లు ఉండనున్నాయి. క్యూ800బీలో సైడ్ ఫేసింగ్ స్పీకర్లు, 5.1.2 చానెల్ స్పీకర్, క్యూ700బీలో టాప్ ఫేసింగ్ ఫీచర్లు, 3.1.2 చానెల్, క్యూ600బీలో క్యూ-సింఫనీ, జెన్-2 ఆడియో సెటప్ ఉన్నాయి.
ఇక ఎస్-సిరీస్‌లో ఎస్801బీ విషయానికి వస్తే... ఇందులో 3.1.2 చానెల్ సరౌండ్ సౌండ్ సెటప్, బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్ ఉండనుంది. డాల్బీ అట్మాస్, డీటీఎస్ వర్చువల్: ఎక్స్ ఆడియో కూడా ఉండనున్నాయి. ఇక ఎస్61బీ సౌండ్ బార్‌లో 5.0 చానెల్ సరౌండ్ సౌండ్ సెటప్ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram