Redmi Pad: రూ.15 వేలలోపే రెడ్‌మీ కొత్త ట్యాబ్లెట్ - 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 అంగుళాల డిస్‌ప్లే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో తన ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది.
రెడ్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఈ ట్యాబ్‌లో అందించారు.
రెడ్‌మీ ప్యాడ్ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 గానూ ఉంది. గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్, మూన్ లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐ యూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పని చేయనుంది. ఇందులో 10.61 అంగుళాల 2కే ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2000 x 1200 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. దీని మందం కేవలం 0.71 సెంటీమీటర్లు మాత్రమే కావడం విశేషం. బరువు కూడా 465 గ్రాములుగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై రెడ్‌మీ ప్యాడ్ పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ట్యాబ్లెట్ వెనకవైపు, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 8000 ఎంఏహెచ్ కాగా, 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను రెడ్‌మీ ప్యాడ్ సపోర్ట్ చేయనుంది.
వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. రెండు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఈ ఫోన్‌తో అందించనున్నారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram