Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసింది - సోనీ, జేబీఎల్‌లో ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి!
నథింగ్ ఇయర్ స్టిక్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.
![Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసింది - సోనీ, జేబీఎల్‌లో ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి! Nothing Ear Stick Launched 5 Alternatives To These Lypertek TEVI Sony Jabra More brands to Choose Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసింది - సోనీ, జేబీఎల్‌లో ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/27/916e4705bb1346bf16443e19c472876e1666871263367252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నథింగ్ ఇయర్ (స్టిక్) ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అధికారికంగా లాంచ్ అయ్యాయి. వీటి ధరను రూ.8,499గా నిర్ణయించారు. గతంలో లాంచ్ అయిన నథింగ్ మొదటి ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కంటే రూ.1,000 ఎక్కువ ధరతో లాంచ్ అయింది. 12.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఇందులో లాంచ్ చేశారు. ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు గంటల కాలింగ్ టైంను ఇది అందించనుంది. కేస్ 29 గంటల పాటు ఆడియో ప్లేబ్యాక్‌ను అందించనుంది. నవంబర్ 4వ తేదీ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒకవేళ నథింగ్ ఇయర్ (స్టిక్) మీకు నచ్చకపోతే, ఈ ప్రత్యామ్నాయాలను చెక్ చేయవచ్చు:
1. లైపర్‌టెక్ టెవి (ప్యూర్ ప్లే జెడ్3)
వీటి ధర మనదేశంలో రూ.7,999గా ఉంది. ఇందులో ఆరు గంటల 6 ఎంఎం గ్రాఫీన్ డ్రైవ్స్‌ను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ బడ్స్ డెలివర్ చేస్తాయి. కేస్‌తో కలుపుకుంటే ఏకంగా 80 గంటల బ్యాటరీ బ్యాకప్ అందించనున్నారు.
2. సోనీ డబ్ల్యూఎఫ్-ఎక్స్‌బీ700
వీటి ధరను రూ.5,990గా నిర్ణయించారు. ఇందులో బేస్ బాగా అందించనున్నారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే తొమ్మిది గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నాయి. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తోనే గంట ప్లేబ్యాక్‌ను పొందవచ్చు.
3. జబ్రా ఎలైట్ 4 యాక్టివ్
వీటి ధర రూ.5,001గా ఉంది. ఐపీ57 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కూడా అందించారు. ఒకసారి చార్జింగ్ పెడితే ఏడు గంటల ఆడియో ప్లేబ్యాక్‌ను ఈ బడ్స్ డెలివర్ చేయనున్నాయి. కేస్‌తో కలిపినప్పుడు అది 28 గంటలకు పెరగనుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) ఫీచర్‌ను కూడా వీటిలో అందించారు.
4. జేవీసీ హెచ్ఏ-ఈటీ90బీటీ
వీటి ధరను రూ.4,999గా నిర్ణయించారు. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే మూడు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ బడ్స్ అందించనున్నాయి. 8.2 ఎంఎం డ్రైవర్లు ఈ బడ్స్‌లో ఉన్నాయి.
5. జేబీఎల్ ట్యూన్ ఫ్లెక్స్
రూ.6,999కే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్స్ బడ్స్‌లో నాలుగు మైక్‌లు ఉండనున్నాయి. ఫోన్ కాల్స్ సమయంలో మెరుగైన క్వాలిటీని ఇవి అందించనున్నాయి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)