News
News
X

Lava Probuds N11: రూ.999కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - సౌండు మాత్రం మామూలుగా ఉండదంట!

లావా ప్రోబడ్స్ ఎన్11 ఇయర్స్ బడ్స్ మనదేశంలో రూ.999కే లాంచ్ అయ్యాయి. అయితే ఇది ఆఫర్ ప్రైస్ మాత్రమే.

FOLLOW US: 

లావా ప్రోబడ్స్ ఎన్11 ఇయర్‌బడ్స్ మనదేశంలో లాంచ్ అయింది. ఇవి మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. వీటిని ప్రారంభ ఆఫర్ కింద రూ.999కే కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇవి రూ.999కే అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఆఫర్ పూర్తయ్యాక రూ.1,499కు వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఫైర్‌ఫ్లై గ్రీన్, కై ఆరెంజ్, పాంథర్ బ్లాక్ రంగుల్లో ఇవి లాంచ్ అయ్యాయి. లావా ఈ-స్టోర్, అమెజాన్‌లతో పాటు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఆన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 

లావా ప్రోబడ్స్ ఎన్11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో డ్యూయల్ హాల్ స్విచ్ ఫంక్షన్, డాష్ స్విచ్, టర్బో లాటెన్సీ, ప్రో గేమ్ మోడ్, ఇన్వెరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సీ) అందించారు. 280 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ప్రోబడ్స్‌లో అందించారు. ఏకంగా 42 గంటల ప్లేటైంను ఇది అందించనుంది. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే 13 గంటల పాటు పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు.

వీటిలో 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి పవర్ ఫుల్ సౌండ్‌ను డెలివర్ చేయనున్నాయి. బేస్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ ఫ్రెండ్స్‌తో కానీ షేర్ చేసుకోవడానికి ఇందులో డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఫీచర్ ఇందులో ఉంది. ఐపీఎక్స్6 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ వీటిని స్వెట్, స్ప్లాష్ రెసిస్టెంట్‌గా మార్చింది.

ఈ నెక్‌బ్యాండ్‌లో ఈఎన్‌సీ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. మెరుగైన వాయిస్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్, నాయిస్ ఫ్రీ వాయిస్ క్లారిటీని ఇవి అందించనున్నాయి. ఇందులో ఉన్న మ్యాగ్నెటిక్ హాల్ స్విచ్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్ చేయడం, కాల్‌ను కట్ చేయడం, ఆన్సర్ చేయడం వంటివి చేయవచ్చు.

దీంతోపాటు గూగుల్, సిరిలను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా రెండు డివైస్‌లను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. వీటికి 12 నెలల వారంటీ అందించనున్నారు. వీటిని కొనుగోలు చేసిన 30 రోజుల్లోపు రిజిస్టర్ చేసుకుంటే రెండు నెలల అదనపు వారంటీ, గానా సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.

లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులైలో లాంచ్ అయింది. ఇప్పుడు అందులో ప్రో మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. అదే లావా బ్లేజ్ ప్రో. దీన్ని కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్‌లో ‘కమింగ్ సూన్’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ ఫోన్ సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లావా షేర్ చేసిన ట్వీట్‌ను బట్టి ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. బ్లూ, గోల్డ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇవి తప్ప ఈ ఫోన్ గురించి మిగతా సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు కొన్ని ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ఈ లీకుల ప్రకారం... లావా బ్లేజ్ ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 6x జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు. హోల్ పంచ్ కటౌట్ కూడా ఉండనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 10 Sep 2022 11:15 PM (IST) Tags: Lava Probuds N11 Offer Price Lava Probuds N11 Price in India Lava Probuds N11 Lava Probuds N11 Features Lava Probuds N11 Launched

సంబంధిత కథనాలు

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

Honor Tab 8 Launched: బడ్జెట్ ధరలో హానర్ కొత్త ట్యాబ్ - మనదేశంలో ఎంట్రీ!

Honor Tab 8 Launched: బడ్జెట్ ధరలో హానర్ కొత్త ట్యాబ్ - మనదేశంలో ఎంట్రీ!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Whatsapp Call Links : వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Whatsapp Call Links :  వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్