అన్వేషించండి

Best Smartwatches: రూ.2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఇవే - తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్!

తక్కువ ధరకే మార్కెట్లో మంచి స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ లిస్టు చెక్ చేయండి..

Best smartwatches in India: ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. టైమ్ తో పాటు హెల్త్ ట్రాకింగ్ కోసం వీటిని వాడుతున్నారు. ఇండియన్ మార్కెట్లో రూ. 2 వేల లోపు మంచి ఫీచర్లు కలిగి ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1.బోట్ వేవ్ సిగ్మా 3- ధర. రూ. 1,999

BoAt Wave Sigma 3 మే 22, 2024న భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. దీని ధర రూ.1,999. ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 2.01-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. కస్టమ్ వాచ్ ఫేస్‌ల కోసం DIY వాచ్ ఫేస్ స్టూడియోతో వస్తుంది. డయల్ ప్యాడ్, కాంటాక్ట్ లిస్టుతో సహా బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు చేస్తుంది. నావిగేషన్, SpO2, హార్ట్ రేట్, స్లీప్, ఎనర్జీ లెవెల్స్ ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్, రన్నింగ్ సహా 700 కంటే ఎక్కువ ఫిట్‌నెస్ మోడ్‌లను అందిస్తుంది. ఇది  బ్లూటూత్ కాలింగ్ లేకుండా 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. 30 నిమిషాల పాటు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఎమర్జెన్సీ SOS, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, గేమ్‌లు, స్టాప్‌వాచ్, ఫైండ్ మై ఫోన్/వాచ్, అలారం, వాతావరణ హెచ్చరికల్లాంటి ఫీచర్లు ఉన్నాయి.

2. నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ 3 ప్లస్- ధర. రూ. 1,699

Noise ColorFit Icon 3 Plus మార్చి 20, 2024న భారతీయ మార్కెట్లోకి విడుదల అయ్యింది. దీని ధర రూ.1,699. ఇది 240×282 పిక్సెల్ రిజల్యూషన్ తో 1.2-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. హార్ట్ రేట్, SpO2 మానిటరింగ్ కోసం  సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇది ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. స్టాండ్‌బైలో 30 రోజుల వరకు ఉంటుంది. ఇది బ్లూటూత్ 5.3కి సపోర్టు చేస్తుంది. iOS 11.0+, Android 9.0+కి సపోర్టు చేస్తుంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్. కాలర్ వివరాలు, కాల్ రిజెక్షన్, AI వాయిస్ అసిస్టెంట్, స్టాప్‌వాచ్, టైమర్, అలారం, రిమైండర్లు, వెదర్ అప్‌డేట్లు, వైబ్రేషన్ అలర్ట్‌ ను కలిగి ఉంటుంది.  

3. ఐటెల్ ఐకాన్ 3- ధర. రూ. 1,699

ఈ స్మార్ట్ వాచ్ మార్చి 22, 2024న దేశీ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 1,699.  ఇది 2.01-అంగుళాల 2.5D AMOLED డిస్‌ప్లేను 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. దీని డిస్ ప్లే ఎప్పుడూ ఆన్ లో ఉంటుంది. 150కి పైగా వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌లో 24 గంటల పాటు హెల్త్ ట్రాకింగ్ ఉంటుంది. హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సిజన్ ట్రాకింగ్, ఈజీ నావిగేషన్ కోసం ఫంక్షనల్ క్రౌన్‌తో కూడిన సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇది 310mAh బ్యాటరీని కలిగి ఉంది. 15 రోజుల స్టాండ్‌ బై బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. జనరల్ యూజేస్ తో ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్‌తో రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. ఐటెల్ ఐకాన్ 3 బ్లూటూత్ 5.1కి సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్, iOS పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ను అందిస్తుంది.

4.కల్ట్ యాక్టివ్ TR- ధర. రూ. 1,999

ఈ స్మార్ట్ వాచ్ మార్చి 5, 2024న భారత మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ.1,999. ఇది రౌండ్ డయల్, ఫంక్షనల్ క్రౌన్ సహా 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతో కూడిన మెటల్ డిజైన్‌ను కలిగి ఉంది. 360×360 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 1.52-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్ స్పీడ్ డయల్ ప్యాడ్, కాంటాక్ట్ సేవింగ్‌తో సహా బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇది వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది. 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, ఆక్సీజన్ ట్రాకింగ్ సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు చేస్తుంది. AI వాయిస్ అసిస్టెంట్, రైజ్ టు వేక్, నోటిఫికేషన్లు, వెదర్ అప్‌డేట్లు, బిల్ట్ ఇన్ గేమ్‌లు, కాలిక్యులేటర్ కూడా ఉన్నాయి.

5. నాయిస్ కలర్ ఫిట్ మాక్రో- ధర. రూ. 1,499

ఈ స్మార్ట్ వాచ్ ఫిబ్రవరి 16, 2024న భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ. 1,499. ఈ స్మార్ట్ వాచ్ 2.0-అంగుళాల HD TFT LCD స్క్రీన్‌తో 2.5D కర్వ్డ్ గ్లాస్, ఫంక్షనల్ క్రౌన్‌ను కలిగి ఉంది. ఇది కస్టమైజేషన్ కోసం 200కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను అందిస్తుంది.ఇది నాయిస్ ట్రూ సింక్ టెక్నాలజీ ద్వారా బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు చేస్తుంది. డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్ హిస్టరీ యాక్సెస్‌ను అందిస్తుంది. హార్ట్ రేట్, SpO2 లెవెల్స్, ఒత్తిడి, నిద్ర సహా పలు అంశాలను ట్రాక్ చేస్తుంది. వర్కౌట్ ట్రాకింగ్ కోసం 115కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు చేస్తుంది. 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది.

Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Psych Siddhartha Trailer : 'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
Honda Amaze Vs Maruti Dzire: రెండు కార్లకూ 5 స్టార్ రేటింగ్! కానీ స్కోర్లు, సేఫ్టీ ఫీచర్లలో ఏ కార్ బెస్ట్?
Honda Amaze Vs Maruti Dzire: ఏది ఎక్కువ సేఫ్‌, భారత్ NCAP రేటింగ్‌లో ఏది ముందుంది?
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
Mowgli Trailer : యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
Embed widget