(Source: ECI/ABP News/ABP Majha)
Smartphone Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే మీ ఫోన్ ఫుల్ సేఫ్ - పాటించకపోతే డేటా అస్సాం అయినట్లే!
మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఈ మూడు టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి.
Smartphones Updates: స్మార్ట్‌ఫోన్ వినియోగం నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున్న లేవగానే మనలో చాలా మంది చేసే పని ఫోన్ చేయడం. స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అవుతారు. వర్క్‌కు సంబంధించిన ఈ-మెయిల్స్ చూసుకోవడం, వాట్సాప్ గ్రూప్‌లు చెక్ చేసుకోవడం వంటి వాటిని తమ స్మార్ట్‌ఫోన్‌లలో చేసుకుంటూ ఉంటారు.
చాలా సార్లు మనం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు చాలా తప్పులు చేస్తాం. అవి డివైస్‌కి హాని కలిగించడమే కాకుండా ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఉపయోగించాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించాలి. స్మార్ట్‌ఫోన్‌లలో తరచుగా జరిగే కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం. వీటిని పాటిస్తే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు.
అధికారిక ఛార్జర్‌ని ఉపయోగించండి
వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జర్ లేనప్పుడు, వేరొకరి ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయడం చాలా సార్లు కనిపిస్తుంది. ఇది కాకుండా ఛార్జింగ్ కేబుల్ పాడైపోయినప్పుడు, లోకల్ ఛార్జింగ్ కేబుల్‌ను కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే లోకల్ ఛార్జింగ్ కేబుల్ లేదా వేరొకరి ఛార్జర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు అధిక వోల్టేజ్ చేరడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అలాగే బ్యాటరీ లేదా ప్రాసెసర్ పేలిపోయే అవకాశం ఉంది.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలి
కొంతమంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటారు. దీని కారణంగా మీ స్మార్ట్‌ఫోన్ మాల్వేర్‌పై దాడి జరగవచ్చు. వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తే, మీ డివైస్ చాలా వరకు సురక్షితంగా ఉంటుంది. మీరు థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్ నుంచి బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత ఫోటోలు వంటి ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా సైబర్ నేరస్థులు మీ కెమెరా, స్పీకర్‌ను హ్యాక్ చేయడం ద్వారా ముఖ్యమైన డేటా సేకరించవచ్చు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లు అప్‌డేటెడ్‌గా ఉండాలి
స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవుతున్న ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడానికి మొబైల్ కంపెనీలు ఎల్లప్పుడూ ఓవర్ ది ఎయిర్ (OTA) ద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లను పంపుతాయి. మీరు మీ ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్‌లను సకాలంలో అప్‌డేట్ చేయకపోతే, నష్టాలను చవిచూడవచ్చు. అప్‌డేట్ అయిన ఆపరేటింగ్ సిస్టం ద్వారా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మొబైల్‌ను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తాయి.
ఈ డిజిటల్ యుగంలో మన డేటా, మన ప్రైవసీ సేఫ్‌గా ఉండాలంటే మన ఫోన్ల కంటే మనం స్మార్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు మన డేటా సేఫ్‌గా ఉంటుంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?