అన్వేషించండి

Elon Musk X Content Policy: 18+ ఉంటే తప్పేంటి అన్నారు - ఇప్పుడు మొత్తం ఎత్తిపోయేదాకా తెచ్చుకున్నారు!

X Content Policy: ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ప్రస్తుతం బ్యాన్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. వారి అడల్ట్ కంటెంట్ పాలసీనే దీనికి కారణం. దీనిపై అనేక ప్రభుత్వాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Elon Musk X Adult Content Policy: ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన దగ్గర నుంచి దానికి ఎన్నో మార్పులు చేశారు. దాని పేరును కూడా ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చారు. ఇప్పుడు ఎక్స్/ట్విట్టర్ దాని అడల్ట్ కంటెంట్ పాలసీ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ విధానాన్ని ఇండోనేషియాలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్స్/ట్విట్టర్ తన అడల్ట్ కంటెంట్ పాలసీని మార్చుకోకపోతే, ఆ ప్లాట్‌ఫాంను నిషేధిస్తామని ఇండోనేషియా ప్రభుత్వం హెచ్చరించింది.

ఎక్స్/ట్విట్టర్ కొత్త పాలసీపై వివాదం
ఎలాన్ మస్క్ ఇటీవల ఎక్స్/ట్విట్టర్ కంటెంట్ విధానాన్ని మార్చింది. కొంత వరకు అడల్ట్ కంటెంట్‌ను కూడా తన ప్లాట్‌ఫాంలో అనుమతిస్తుంది. ఈ మార్పు వినియోగదారుల మధ్య చాలా వివాదాస్పదంగా మారింది. అనేక దేశాలు దీని గురించి తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, యువతపై చెడు ప్రభావం చూపుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

Also Read: రియల్‌మీ నార్జో ఎన్63 సేల్ ప్రారంభం - రూ.8 వేలలోపే బడ్జెట్ ఫోన్!

నిషేధ హెచ్చరికను పొందిన ఎక్స్/ట్విట్టర్
ఎక్స్/ట్విట్టర్ తీసుకువచ్చిన ఈ విధానానికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ఎలాన్ మస్క్ తన అడల్ట్ పాలసీని మార్చుకోకపోతే, ఆ ప్లాట్‌ఫాంను నిషేధించాల్సిందని పేర్కొంది. ఇండోనేషియా కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సైన్స్ మంత్రి బుడి అరి సెటియాడి ఈ సమాచారాన్ని అందించారు. దీనికి సంబంధించి ఎక్స్/ట్విట్టర్‌కి లేఖ కూడా పంపామని, అయితే ఈ లేఖపై కంపెనీ ఇంకా స్పందించలేదని సెటియాడి తన ప్రకటనలో తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇటువంటి కంటెంట్‌ను అనుమతించకూడదని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా యువకులు, పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ వివాదం ఎక్స్/ట్విట్టర్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్పష్టమైంది.

అన్ని ప్రభుత్వ నిబంధనలు, సామాజిక విధానాలకు అనుగుణంగా కంపెనీ కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రతినిధి తెలిపారు. ఎక్స్/ట్విట్టర్ తన పాలసీని మార్చుకోకపోతే, అనేక దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఇది దాని పాలసీ, యూజర్ బేస్‌ను ప్రభావితం చేయవచ్చు. మనదేశంలో ఇప్పటికే అడల్ట్ కంటెంట్‌పై నిషేధం ఉంది. కాబట్టి ఎక్స్ ఈ పాలసీని అందుబాటులోకి తీసుకువస్తే బ్యాన్‌ను ఎదుర్కునే అవకాశం ఉంది.

Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget