News
News
వీడియోలు ఆటలు
X

Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు.

FOLLOW US: 
Share:

WhatsApp: వాట్సాప్‌ను అస్సలు నమ్మలేమని ప్రముఖ బిలీనియర్, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. వాట్సాప్‌ ప్రైవసీ విషయంలో ఒక ట్విట్టర్ ఇంజినీర్ చేసిన ఆరోపణపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఆండ్రాయిడ్ డ్యాష్ బోర్డుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా ఆ ట్విట్టర్ ఇంజినీర్ షేర్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ వాట్సాప్‌ను అస్సలు నమ్మలేమన్నారు.

మైక్‌ను ఉపయోగిస్తున్న వాట్సాప్
ఫోడ్ డబిరి అనే పేరున్న ఈ ట్విట్టర్ ఇంజినీర్... తాను నిద్రపోతున్న సమయంలో కూడా వాట్సాప్ తన మైక్రో ఫోన్‌ను ఉపయోగిస్తుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా అందులో షేర్ చేశారు. దీనిపైనే ఎలాన్ మస్క్ స్పందించారు.

స్పందించిన వాట్సాప్
అయితే దీనిపై వాట్సాప్ స్పందించింది. స్క్రీన్ షాట్ తీసిన ఫోన్ గూగుల్ పిక్సెల్ 6ఏ కాబట్టి దీనిపై మరింత విచారణ చేయాల్సిందిగా గూగుల్‌ను వాట్సాప్ కోరింది. కాల్ చేస్తున్నప్పుడు కానీ, వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ, వాయిస్ నోట్ రికార్డ్ చేసేటప్పుడు కానీ మాత్రమే వాట్సాప్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ట్విట్టర్ ఇంజినీర్‌తో కూడా తాము టచ్‌లో ఉన్నామని వాట్సాప్ తెలిపింది. వినియోగదారులు కాల్స్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మాట్లాడుకునే విషయాలన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సెక్యూర్డ్‌గా ఉంటాయని తెలిపింది.

వాట్సాప్ తరహా ఫీచర్లను తెస్తాం: మస్క్
వాట్సాప్ తరహా ఫీచర్లను ట్విట్టర్‌లో కూడా తీసుకొస్తామని సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ‘ఎన్‌క్రిప్టెడ్ డీఎమ్స్ వీ1.0’ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తన నెత్తిపై గన్ పెట్టి మెసేజ్‌లు చూడమన్నప్పటికీ తాను కూడా చూడలేనని మస్క్ తెలిపారు.

త్వరలో ట్విట్టర్‌లో వాయిస్ ఛాట్, వీడియో ఛాట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న వారితో అయినా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడవచ్చని ఎలాన్ మస్క్ అన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చాలా మార్పులు జరిగాయి. 

Published at : 10 May 2023 04:47 PM (IST) Tags: WhatsApp Elon Musk Twitter New Features TWITTER

సంబంధిత కథనాలు

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!

BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!

WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!

WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!