Photo@elonmusk/twitter
ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకునే పలు నిర్ణయాల కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడటంతో పాటు వెరిఫైడ్ టిక్స్ విషయాలోనూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డబ్బులు చెల్లిస్తే బ్లూ టిక్ అందిస్తామంటూ ఆఫర్ చేశారు. ఇక తాజాగా ట్విట్టర్ లోగోను సైతం మార్చేశారు. బర్డ్ స్థానంలో కుక్క పిల్లను తీసుకొచ్చారు. మస్క్ నిర్ణయాలతో వినియోగదారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఇక ప్రస్తుతం మస్క్ తీసుకోబోయే నిర్ణయం కారణంగా ఏకంగా ట్విట్టర్ మాయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కలిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తాజాగా వస్తున్న నివేదిక ప్రకారం ట్విట్టర్ ను ‘X’ అనే 'ఎవ్రీథింగ్ యాప్'లో విలీనం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రక్రియ సైతం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మస్క్ ‘X’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన ఇంకే నిర్ణయం తీసుకోబోతున్నారో అని ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు ట్విట్టర్ కనుమరుగు కాబోతోందని కొంతమంది టెక్ నిపుణులు వివరించారు. X Corp అనే సంస్థలో విలీనం చేయబోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన ‘X’ ట్వీట్ కు సమాధానం దొరికినట్లేనని నెటిజన్లు ట్వీట్స్ చేశారు. త్వరలోనే X Corpలో ట్విట్టర్ విలీన్ కానున్నట్లు తెలుస్తోంది.
X
— Elon Musk (@elonmusk) April 11, 2023
వాస్తవానికి ట్విట్టర్ టేకోవర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే మస్క్ X Corp వివరాలను బయటకు వెల్లడించారు. అంతేకాదు, ఇప్పటికే ‘X’ యాప్ గురించి మస్క్ పలుమార్లు ప్రస్తావించారు. ఈ యాప్ తన లాంగ్ టర్మ్ బిజినెస్ ప్లాన్ గా అభిప్రాయపడ్డారు. దీనిని రూపకల్పనకు ట్విట్టర్ ఎంతో ఉపయోగపడనున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే, తన ‘X’ యాప్ కనీసం ఐదు సంవత్సరాలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన గతేడాది వెల్లడించారు. అనుకున్నట్లుగానే ట్విట్టర్ ను కొనుగోలు చేసి ఇప్పుడు X Corpలో విలీనం చేయబోతున్నారు మస్క్.
వాస్తవానికి చైనాలో మోస్ట్ పాపులర్ యాప్ ‘WeChat’. ఇందులో చాలా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. మెసేజింగ్ తో పాటు కాలింగ్ అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, మనీ ట్రాన్స్ ఫర్ అవకాశం కూడా ఉంది. ఒకే యాప్ తో అనేక పనులకు ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ రూపొందించిన ‘X’ అనే 'ఎవ్రీథింగ్ యాప్' కూడా ఇలాగే పని చేయబోతోంది. వాస్తవానికి మస్క్ 1999లో ‘X’ అనే ఆన్ లైన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి దాన్ని ‘పేపాల్’లో విలీనం చేశారు. అనంతరం ఎక్స్.కామ్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ ను సూపర్ యాప్ గా రూపొందించే పనిలో బిజీ అయ్యారు. గత సంవత్సరం మస్క్ ట్విట్టర్ కంపెనీని $44 బిలియన్లకు కొనుగోలు చేశారు.
Read Also: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!
BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్తో వెంటనే ఓపెన్ చేయండి!
WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!
BGMI: బీజీఎంఐ ప్లేయర్స్కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!
iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్