Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు.
Twitter Traffic: ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక దాని పేరును ‘ఎక్స్’ అని మార్చాడు. ఇప్పుడు ట్విట్టర్ ట్రాఫిక్‌కు సంబంధించి ఒక పోస్ట్‌ను మస్క్ షేర్ చేశాడు. ఇందులో మెటా సోషల్ మీడియా సర్వీసులు అయిన ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) కంటే ఎక్స్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఎక్కువ అని తెలిపారు. ట్రాఫిక్ కోసం మెటా, ఎక్స్ ఎంత ఖర్చు చేస్తున్నాయో వివరించారు.
— Elon Musk (@elonmusk) December 4, 2023
డెస్క్ టాప్ వెర్షన్‌లో ఎక్స్ ట్రాఫిక్ నవంబర్‌లో 650.9 మిలియన్లు కాగా, ఫేస్‌బుక్ ట్రాఫిక్ 496.5 మిలియన్లు కాగా, ఇన్‌స్టాగ్రామ్ ట్రాఫిక్ 520.7 మిలియన్లుగా ఉంది. అంటే ఎక్స్‌కి ఎక్కువ ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంది.
ఇది కాకుండా ఎక్స్ పెయిడ్ ట్రాఫిక్ కేవలం 1,100 మాత్రమే. అయితే ఫేస్‌బుక్ పెయిడ్ ట్రాఫిక్ 708.4k కాగా, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ 99.9kగా ఉంది. అంటే ఎక్స్‌తో పోలిస్తే ఈ రెండు ప్లాట్‌ఫారంలు పెయిడ్ ట్రాఫిక్‌పై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నాయి.
ఈ పోస్ట్ ప్రకారం ఎక్స్ కేవలం 14,300 డాలర్లను (మనదేశ కరెన్సీలో దాదాపు రూ. 12 లక్షలు) ట్రాఫిక్ కోసం ఖర్చు చేస్తే ఫేస్‌బుక్ 1.1 మిలియన్ డాలర్లను (మనదేశ కరెన్సీలో సుమారు రూ.91.6 లక్షలు), ఇన్‌స్టాగ్రామ్ 105.4k డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.87.8 లక్షలు) ఖర్చు చేశాయి.
పెయిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి?
సోషల్ మీడియా కంపెనీలు గూగుల్ యాడ్ పేజీలో కనిపించే కీవర్డ్స్‌ను డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తాయి. ఇక్కడ నుంచి వినియోగదారులు మళ్లీ వెబ్‌సైట్‌కి చేరుకుంటారు.
ఎక్స్‌ను అవాయిడ్ చేస్తున్న కంపెనీలు
ప్రస్తుతానికి చాలా కంపెనీలు ఇకపై ‘ఎక్స్’లో ప్రకటనలు చేయడానికి ఇష్టపడవు. ఇటీవల డిస్నీ, ఐబీఎం, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి కంపెనీలు ఎక్స్‌లో తమ పెయిడ్ యాడ్ క్యాంపెయిన్‌లను ఉపసంహరించుకున్నాయి. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానిస్తూ వారు ప్రకటనలు ఇవ్వడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరైనా ప్రకటనల డబ్బుతో తనను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే, వారినే పారిపొమ్మని అన్నారు.
మరోవైపు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి స్థానంలో నిలిచింది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌లో వినియోగదారుల సౌకర్యం కోసం మళ్లీ కొత్త ఫీచర్లు తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు టెక్స్ట్ స్టేటస్ ఫీచర్‌లో డిజప్పియరింగ్ ఆప్షన్ త్వరలో రానుంది. అంటే వాట్సాప్‌లో ఏదైనా టెక్ట్స్‌ను స్టేటస్‌గా పెట్టినప్పుడు, డిజప్పియరింగ్ ఫీచర్ ఆన్‌లో పెట్టుకున్నప్పుడు నిర్దిష్ట సమయం తర్వాత అది డిలీట్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!