By: ABP Desam | Updated at : 26 Jan 2023 09:14 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@elonmusk/twitter
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, దానితో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లతో ఆకట్టుకునే టెస్లా అధినేత తాజాగా తన పేరు మార్చుకున్నారు. ట్విట్టర్ అకౌంట్ కు ఎలన్ మస్క్ అనే పేరు ఉండగా ఇప్పుడు దాన్ని ‘మిస్టర్ ట్వీట్’గా మార్చేశారు. పేరు మార్చుకున్న తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. “నా ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నాను. కానీ, తిరిగి మార్చాలి అనుకున్నా ట్విట్టర్ అనుమతించడం లేదు” అంటూ ఫన్నీ ఎమోజీని పోస్టు చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లను చెలరేగిపోతున్నారు. పలువురు ఆయనను ఆటాడేసుకుంటున్నారు. ఎందుకు పేరు మార్చారంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.
Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣
— Mr. Tweet (@elonmusk) January 25, 2023
ఎలన్ మస్క్ పై నెటిజన్ల సటైర్లు
ఎలన్ మస్క్ వ్యవహారం ట్విట్టర్ ను కామెడీ చానెల్ గా మార్చేస్తున్నట్లు అనిపిస్తోందని నెటిజన కామెంట్ చేశారు. మార్చేసినట్లు అనిపించడం కాదు, నిజంగానే కామెడీ చానెల్ గా ఉందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్న వాళ్లంతా బ్లూ టిక్ కోల్పోయారు. మరి మీ అకౌంట్ ఎందుకు బ్లూ టిక్ కోల్పోలేదు? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశారు. ఇకపై నా అకౌంట్ పేరును ఎలన్ మస్క్ అని పెట్టుకుంటాను అంటూ మరో నెటిజన్ బదులిచ్చాడు. వరుస ట్వీట్లతో మస్క్ పై జోకులు పేల్చుతున్నారు.
So now i can change my name to Elon Musk? 😎
— Ali Ahmad Awan (@AliAhmadAwan_) January 25, 2023
As you changed your display name how the blue tick didn't get hide? Is twitter policy different with you? 😀😀@TwitterBlue pic.twitter.com/irUSiRU3dv
— Manish Bothra🇮🇳 (@MoneyMystery) January 25, 2023
మస్క్ చేతికి చిక్కి నష్టపోతున్న ట్విట్టర్
గత సంవత్సరంలో ట్విట్టర్ ను కోనుగోలు చేసిన తర్వాత మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను అనుకున్న విధంగా ట్విట్టర్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. పలు దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాలను అమ్మకానికి పెట్టారు. ఇన్నీ చేసినా ఆయన అనుకున్నట్లుగా లాభాల్లోకి రాకపోగా మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచే ట్విట్టర్ షేర్ వ్యాల్యూ పడిపోతూ వస్తోంది. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం 75 శాతం వరకు నష్టాలు వచ్చినట్లు తేలింది. ‘స్టాండర్డ్ మీడియా ఇండెక్స్’ రిపోర్టు ప్రకారం ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ప్రకటనదారులు ట్విట్టర్ కు ఇచ్చే యాడ్స్ నిధులను భారీగా తగ్గించారని తెలిపింది. గత డిసెంబర్‌లో ఆదాయం 71 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. అయితే, ప్రకటనదారులను ఆకట్టుకునేందుకు ట్విట్టర్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Read Also: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి