Top OTT Platforms: భారతీయులు ఎక్కువగా చూసే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇవే.. టాప్-5 ఏవంటే?

ప్రస్తుతం మనదేశంలో ఓటీటీ మేనియా కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో ఎంతో ముందుకు ఓటీటీ మార్కెట్ దూసుకువెళ్లింది. భారతీయులు ఎక్కువగా చూసే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇవే.

FOLLOW US: 

మనదేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు గత రెండు సంవత్సరాల్లో ఎంతో దూసుకుపోయాయి. కరోనావైరస్ కారణంగా లాభపడిన వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి. ఇంట్లోనే ఉంటూ వరల్డ్ సినిమాకు ఎక్స్‌పోజర్ రావడంతో ఎంతో మంది ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫాంల్లో ఎక్స్‌క్లూజివ్ షోలు కూడా అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి మనదేశంలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ నంబర్‌వన్ ఓటీటీ ప్లాట్‌ఫాంగా నిలిచాయి. జస్ట్‌వాచ్ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీసు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ ప్లాట్‌ఫాంలపై పెర్ఫార్మెన్స్ రివ్యూని అందించింది. 2021 మూడో త్రైమాసికంలో కూడా డిస్నీప్లస్ హాట్‌స్టారే నంబర్‌వన్‌గా నిలిచింది. రెండో త్రైమాసికంలో పోలిస్తే రెండు శాతం అదనపు గ్రోత్‌ను కూడా హాట్‌స్టార్ సాధించింది.

కానీ హాట్‌స్టార్ మార్కెట్ షేర్ మాత్రం గత నెలతో పోలిస్తే ఒక శాతం పడిపోయింది. గత జనవరి నుంచి హాట్ స్టార్ మార్కెట్ షేరు ఐదు శాతం పెరిగింది. ఈ జాబితాలో హాట్‌స్టార్ తర్వాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ మూడో స్థానంలో నిలవగా.. జీ5 నాలుగో స్థానంలో ఉంది.

వూట్ ఐదో స్థానాన్ని సంపాదించుకోగా.. సోనీలివ్, జియో సినిమా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఆల్ట్ బాలాజీ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హాట్ స్టార్ ఇటీవలే ఒరిజినల్ షోలు స్ట్రీమ్ చేయడంతో పాటు సినిమాలను కూడా అగ్రెసివ్‌గా కొనడం ప్రారంభించింది.

హమ్ దో హమారే దో, షిద్ధత్, క్రూయెల్లా, భుజ్ సినిమాలను హాట్‌స్టార్ స్ట్రీమ్ చేయడం మొదలు పెట్టింది. తెలుగులో కూడా నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను హాట్‌స్టార్ స్ట్రీమ్ చేసింది. తేజ సజ్జ నటించిన అద్భుతం సినిమా నవంబర్ 19వ తేదీన హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీంతోపాటు వాండా విజన్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, లోకి, వాట్ ఇఫ్? వంటి మార్వెల్ కంటెంట్ కూడా హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్ విడో వంటి భారీ బడ్జెట్ సినిమాను కూడా నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల చేశారు. దీంతో పాటు క్రికెట్ కంటెంట్ కూడా హాట్‌స్టార్ నంబర్ వన్ కావడానికి కారణం అయ్యాయి.

Also Read: నయనతార... వచ్చింది... నటించింది... గెలిచింది! - సమంత

Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?

Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...

Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !

Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 04:36 PM (IST) Tags: Netflix Amazon Prime Top OTT Platform in India DisneyPlus Hotstar Hotstar

సంబంధిత కథనాలు

Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!

Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

LG Rollable TV: ఈ టీవీ రేటుకి ఇల్లే కొనేయచ్చుగా - ఎల్జీ కొత్త టీవీ స్పెషాలిటీ ఏంటంటే?

LG Rollable TV: ఈ టీవీ రేటుకి ఇల్లే కొనేయచ్చుగా - ఎల్జీ కొత్త టీవీ స్పెషాలిటీ ఏంటంటే?

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !