ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది.
టెక్ రంగంలోకి లేటుగా వచ్చినా, లేటెస్టుగా వచ్చింది Chat GPT. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చక్కటి ఆదరణ దక్కించుకుంది. కచ్చితమైన సమాచారం, వెంటనే అందించే లా రూపొందించిన Chat GPT ద్వారా నిత్యం ఎంతో మంది కంటెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు Chat GPT సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వాయిస్‌ని ఉపయోగించి AI-ఆధారిత చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా సాయాన్ని పొందడానికి వినియోగదారులను అనుమతించే మరొక ఫీచర్‌ని కూడా యాడ్ చేసింది.
కొత్త ఫీచర్లను యాడ్ చేసిన ChatGPT
OpenAI తన AI- పవర్డ్ చాట్‌బాట్ – ChatGPTకి కొత్త ఫీచర్లను జత చేస్తోంది. త్వరలోనే సరికొత్త వాయిస్, ఇమేజ్ సామర్థ్యాన్ని AI చాట్‌బాట్‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ వాయిస్‌ని ఉపయోగించి ప్రశ్నలు అడగడంతో పాటు కావాల్సిన సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
voice mode and vision for chatgpt! really worth a try. https://t.co/g8uA4QxXMb
— Sam Altman (@sama) September 25, 2023
ChatGPT వాయిస్ చాట్
మొబైల్స్ లో ChatGPT వినియోగదారులు ఇకపై చాట్ బాట్ తో సంభాషించే అవకాశం ఉంది. అంటే వినియోగదారులు చాట్‌బాట్ ను ప్రశ్నలను అడగవచ్చు. అప్పటికప్పుడు సమాధానాలు పొందవచ్చు. కొత్త ఫీచర్‌ను మీ మోబైల్ లో ఈజీగా గుర్తించే అవకాశం ఉంది. ముందుగా మీ మొబైల్‌లో ChatGPT యాప్‌ని ఓపెన్ చేయాలి. యాప్ ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి. ఆ తర్వాత ‘న్యూ ఫీచర్స్’ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘వాయిస్ చాట్’ అనే ఆప్షన్ కనిపిస్తోంది. యూజర్ వాయిస్ ను చాట్ బాట్ టెక్ట్స్ లోకి మార్చుకుని సమాధానాలు ఇస్తుంది. ఈ వాయిస్ ఫీచర్ అచ్చం మనిషి మాదిరిగానే పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది.
ChatGPT విజన్
అటు ఫోటోలను చాట్ జీపీటీలోకి అప్ లోడ్ చేయడం ద్వారా పలు ఎప్పటికప్పుడు పలు వివరాలను పొందే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. భోజన సమయాన్ని గుర్తు చేయడంతో పాటు మీ ఫ్రిజ్ లోని పదార్థాల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించనుంది. చాట్ జీపీటీలోకి ఫ్రిజ్ ఫోటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఈ వివరాలను పొందే అవకాశం ఉందని తెలిపింది. మొబైల్ యాప్‌లోని డ్రాయింగ్ టూల్‌ను ఉపయోగించి యూజర్లు ఇమేజ్ ను కచ్చితంగా అప్ లోడ్ చేయడం ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాయిస్ చాట్, ఇమేజ్ రికగ్నిషన్ ఫీచర్లు రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ChatGPT ప్లస్, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని OpenAI తెలిపింది. ChatGPT ప్లస్ ధర భారత్ లో నెలకు రూ.1,600గా కంపెనీ నిర్ణయించింది.
Read Also: ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial