Android Users Security Alert: కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు డేటా లీక్ ముప్పు! భారత ప్రభుత్వం కీలక ప్రకటన
Android CERT-In Issues Warning: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం డేటాకు సంబంధించి కీలక హెచ్చరిక విడుదల చేసింది. Android యూజర్లు ఈ విషయం తెలుసుకుంటే మంచిది.

CERT-In Issues Warning: భారత ప్రభుత్వం కోట్లాది మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు (Android Users) కు ఒక ముఖ్యమైన సేఫ్టీ వార్నింగ్ జారీ చేసింది. క్వాల్కమ్ (Qualcomm) చిప్‌సెట్‌లతో నడిచే పరికరాలకు సంబంధించి హెచ్చరించింది. భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) విడుదల చేసింది. ఈ డివైజ్2లలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. ఈ బలహీనతలను మొదట Google యొక్క థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ గుర్తించినట్లు సమాచారం.
మీ ఫోన్‌లోకి చొరబడే మార్గం ఓపెన్
CERT-In ప్రకారం, ఈ భద్రతా లోపాలను ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మీ డివైజ్ నుంచి వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను చోరీ చేసే అవకాశం ఉంది. వారు ఇష్టానుసారం కోడింగ్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చు.
ఏ Qualcomm చిప్‌సెట్‌లతో ప్రమాదం
ఈ నెలలో వచ్చిన సేఫ్టీ బులెటిన్‌ను 'అధిక ప్రమాదం' కేటగిరీలో ఉంచారు. Qualcomm సంబంధిత చిప్‌సెట్‌లు, GPUలు, వైఫై (Wi-Fi) మోడెమ్‌లలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. బులెటిన్ ప్రకారం, స్నాప్‌డ్రాగన్ 480+ 5G, Snapdragon 662, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, లేటెస్ట్ Snapdragon 8 Gen 3 (2024 ఫ్లాగ్‌షిప్ చిప్) వంటి మోడల్‌లు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ముందు ఈ లోపాలను దృష్టిలో ఉంచుకుని Qualcomm తన భాగస్వాములు, వినియోగదారులతో పాటు బిజినెస్ పార్ట్‌నర్స్ ను అప్రమత్తం చేసింది.
Qualcomm ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకుంది?
CERT-In ప్రకారం, క్వాల్కమ్ ఈ ప్రమాదాల గురించి తెలుసుకుంది. ఇందులో కొన్ని లోపాలను సైబర్ నేరగాళ్లు ఇప్పటికే ఉపయోగించుకుని ఉండవచ్చని సైతం భావిస్తున్నారు.
Android యూజర్లు ఏం చేయాలి..
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Qualcomm చిప్‌సెట్‌పై పనిచేస్తున్నట్లయితే, వెంటనే మే 2025 Android సేఫ్టీ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ డివైజ్‌లను సైబర్ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
మీ సేఫ్టీ ప్యాచ్ అప్‌డేట్ చేయండి:
- మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి
- క్రిందికి స్క్రోల్ చేసి సిస్టమ్ అప్‌డేట్‌లను సెలక్ట్ చేసుకోవాలి
- అప్‌డేట్ కోసం చెక్ చేసి, క్లిక్ చేయండి.
- కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తే, వెంటనే ఇన్‌స్టాల్ చేయండి
- అనంతరం మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రీబూట్ చేయండి
- ఇప్పుడు మీ ఫోన్ లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్ అప్‌డేట్‌తో సురక్షితంగా ఉంటుంది.






















